యంగ్ టైగర్ ఎన్టీఆర్ పోస్ట్ పోన్ అయిన ఆర్.ఆర్.ఆర్ విషయం పక్కనబెట్టి ఆయన తదుపరి మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. మార్చ్ లో అయినా, లేదంటే ఏప్రిల్ లో అయినా రిలీజ్ అవ్వబొయె ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ అప్పుడు చూసుకోవచ్చు.. ఇప్పుడు కొత్త సినిమా మొదలు పెట్టాలని ఎన్టీఆర్ చూస్తున్నారట. ఎలాగూ కొరటాల తో తన తదుపరి NTR30 ని ఫిబ్రవరిలో మొదలు పెట్టబోతున్నట్లుగా నేషనల్ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. అనుకున్నట్టుగానే ఎన్టీఆర్ - కొరటాల కాంబో మూవీ ఫిబ్రవరిలోనే మొదలు కాబోతుంది. దానికి సంబందించిన అప్ డేట్ ఓ స్పెషల్ డేట్ కి ఇవ్వబోతున్నారు.
ఫిబ్రవరి రెండో తారీఖున NTR 30 అప్ డేట్ రాబోతుంది అంటే 2-2-22 అనే స్పెషల్ డేట్ లో NTR30 అప్ డేట్ ఇవ్వబోతున్నారు మేకర్స్. అన్ని రెండు అంకెలు కలిసిన ఆ స్పెషల్ డేట్ న NTR30 నుండి ఎలాంటి అప్ డేట్ ఇస్తారో అనే క్యూరియాసిటిలో ఎన్టీఆర్ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ రొమాన్స్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. కొరటాల శివ కి కూడా మహేష్ తో చేసిన భరత్ అనే నేను - చిరు తో చేస్తున్న ఆచార్య మూవీ కి దాదాపుగా మూడేళ్లు గ్యాప్ రావడంతో.. ఇప్పుడు ఎన్టీఆర్ తో చెయ్యబోయే మూవీ ని ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ఫినిష్ చెయ్యాలనే ఆలోచనలో కొరటాల ఉన్నారు. ఎన్టీఆర్ డేట్స్ ని బట్టి మూవీ ఎంత ఫాస్ట్ గా ఫినిష్ చెయ్యాలో కొరటాల ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ కియారా అద్వానీ ని సంప్రదించినట్లుగా తెలుస్తుంది.