పవన్ కళ్యాణ్ - క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు మూడు షెడ్యూల్స్ పూర్తయిన తరువాత, పవన్ కళ్యాణ్ వేరే సినిమా భీమ్లా నాయక్, అలాగే తన రాజకీయ పనులతో కొంచెం బిజీ గా ఉండటం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగింది. త్వరలోనే హరి హర వీరమల్లు కొత్త షెడ్యూల్ మొదలు పెడతారని సమాచారం. అయితే ఈ సినిమా కోసం క్రిష్ మొదటి నుండి భారీ సెట్స్ నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికి గోల్కొండ ఫోర్ట్, ఇంకా చాలా సెట్స్ వేశారు.
ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలో ఒక చార్మినార్ సెట్ వేసినట్టు తెలుస్తుంది.. హరిహర వీరమల్లుని ఒక పీరియడ్ డ్రామాగా క్రిష్ మలుస్తున్నారు. అందుకోసం ఈ చార్మినార్ సెట్ కూడా వేసినట్టు సమాచారం. చార్మినార్ నేపథ్యంలో కూడా సినిమా కథ కొంత భాగం ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో నటించాల్సిన బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ స్థానంలోకి ఇప్పుడు మరో బాలీవుడ్ భామ నోరా ఫెతి వచ్చినట్టుగా తెలుస్తుంది. హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ లాంటి పాత్ర లో కనపడబోతున్నారని సమాచారం.