Advertisementt

ఈ డాన్స్ మాస్టర్ బిగ్ బాస్ కి పక్కా అంటగా

Thu 27th Jan 2022 04:41 PM
raghu master,bigg boss,bigg boss telugu,bigg boss 6,bigg boss ott,singer hema chandra,singer rpanavi  ఈ డాన్స్ మాస్టర్ బిగ్ బాస్ కి పక్కా అంటగా
Talented Choreographer in Bigg Boss 6 ఈ డాన్స్ మాస్టర్ బిగ్ బాస్ కి పక్కా అంటగా
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సౌత్ లో పెద్దగా క్లిక్ అవ్వకపోయినా.. ప్రతి ఏడాది సీజన్ విజ్ గా బిగ్ బాస్ ని స్టార్ మా లో నడిపిస్తున్నారు. ఐదు సీజన్స్ ని పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్ ఆరో సీజన్ వచ్చేసరికి.. అది ఓటిటికి ఎక్కింది. ఎప్పుడూ ఆగష్టు, సెప్టెంబర్ లో మొదలు అయ్యే బిగ్ బాస్ ఈసారి ఫిబ్రవరిలోనే మొదలు కాబోతుంది. హాట్ స్టార్ ఓటిటిలో 24 గంటలు ప్రసారం అయ్యే ఈ షో.. స్టార్ మా లో రాత్రి గంట ప్రసారం అవుతుంది. అయితే సీజన్ 6 లోకి ఓ నాలుగురు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అడుగుపెడతారని ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది.

అలాగే టాప్ సింగర్ హేమ చంద్ర ఈసారి పక్కాగా బిగ్ బాస్ కి ఎంట్రీ ఇవ్వనున్నాడని అంటున్నారు. సీజన్ 4, 5 లో పాల్గొన్న సింగర్స్ కెరీర్ లో దూసుకుపోవడం చూసిన హేమ చంద్ర ఈసారి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక తెలుగు బిగ్ బాస్ మొదలయ్యాక ప్రతి సీజన్ లోకి ఓ డాన్స్ మాస్టర్ ఎంట్రీ ఇస్తున్నారు. అమ్మా రాజా శేఖర్, బాబా భాస్కర్, ఆని మాస్టర్, ఇక సీజన్ వన్ నుండి ఎవరో ఒకరు వచ్చినట్టుగా.. ఈసారి సీజన్ 6 లోకి ఓ డాన్స్ మాస్టర్ రాబోతున్నారట. కొన్ని సీజన్స్ నుండి బిగ్ బాస్ లోకి కొరియోగ్రాఫేర్ రఘు మాస్టర్ వెళ్ళబోతున్నారని అన్నా.. అది జరగలేదు. కానీ ఈ సీజన్ 6 లోకి రఘు మాస్టర్ పక్కాగా అడుగుపెట్టబోతున్నాడట. అయితే అది భార్య ప్రణవితోనా.. కాదా అనేది తెలియాల్సి ఉంది. అంటే ప్రణవి సింగర్ కాబట్టి.. అటు వైఫ్ ఇటు భర్త ఇద్దరూ బిగ్ బాస్ కి ముఖ్యమే. జంటగా వస్తున్నారో.. లేదంటే అనేది కాస్త సస్పెన్స్.

Talented Choreographer in Bigg Boss 6:

Raghu Master in Bigg Boss 6

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ