ఈమధ్య రామ్ చరణ్ ని పరిశీలిస్తే, అతను ఎంతో పరిణితి చెందిన వ్యక్తిలా కనిపిస్తున్నారు. చరణ్ నడక తీరు, మాట్లాడే తీరు, ఒక పెద్ద స్టార్ అయ్యి వుండి కూడా, చాలాసౌమ్యంగా ఉండటం, ఇవన్నీ రామ్ చరణ్ కి ఎంతో పేరు తీసుకు రావటమే కాకుండా, మరింత ఎత్తుకు ఎదిగేటట్టు చేస్తున్నాయి. అలాగే గుడ్ లక్ సఖి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి వచ్చి ఎంతో చక్కగా మాట్లాడి, తండ్రి అయిన మెగాస్టార్ కి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఎక్కడా చిన్న భేషజం లేకుండా తన మాటలతో అందరిని ఆకట్టుకున్నాడు. అలాగే ఇంత మంది జాతీయ అవార్డులు గెలుచుకున్న టెక్నిషన్స్ పనిచేస్తున్న ఈ గుడ్ లక్ సఖి చిన్న సినిమా ఎలా అవుతుంది, ఇది ఒక పెద్ద సినిమా. తాను ఈ ఫంక్షన్ కి రావటం తన అదృష్టం అన్నాడు.
చరణ్ రావటం వల్లనే ఆ సినిమా కి ఎంతో లాభం, కానీ చరణ్ అలా ఎక్కడా మాట్లాడకుండా, ఎంతో హుందాగా, ఇలాంటి అద్భుత టెక్నిషియన్స్ తో ఆ స్టేజి మీద తాను ఉండటం తన అదృష్టం అన్నాడు. అలాగే కీర్తి సురేష్ ని ఎంతో పొగిడాడు, మహానటి సినిమాలో ఎంత బాగా చేసింది, జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది, అలాంటి కీర్తి సురేష్ ఈ సినిమా చెయ్యటం చాలా బాగుంది అన్నాడు. అలాగే దర్శకుడు నగేష్ కుకునూర్ గురించి అద్భుతమయిన మాటల్ని చెప్పాడు చరణ్. ఇలా అందరి గురించి ఎంతో చక్కగా మాట్లాడి, తాను పెద్ద స్టార్ అయ్యి వుండి కూడా, ఎంతో ఒద్దికగా మాట్లాడి, తండ్రికి తగ్గ తనయుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఇలాంటి లక్షణాలు వున్న ఎటువంటి వ్యక్తి అయినా విజయాలతో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడు. ఉదాహరణ మెగాస్టార్ చిరంజీవి గారే. ఇప్పుడు అదే బాటలో తనయుడు రామ్ చరణ్ కూడా వెళుతున్నాడు. నాన్నగారి తరపున రాలేదు, దూతగా వచ్చాను అన్నాడు. అదొక్కటి చాలు, అతను ఎంత సౌమ్యుడో చెప్పడానికి.