2016 సంక్రాంతికి సోగ్గాడే చిన్నినాయనాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాగార్జున దాని సీక్వెల్ గా తెరకెక్కిన బంగార్రాజుతో 2022 సంక్రాంతికి సందడి చేసారు. ఈసారి ఆయనకి తనయుడు నాగ చైతన్య కూడా తోడయ్యాడు. తగ్గిన టికెట్ రేట్లు, పెరుగుతున్న కరోనా కేసుల్ని చూసి ఇతర భారీ చిత్రాలన్నీ వాయిదాల బాట పడితే.. నాగ్ మాత్రం వాసి వాడి తస్సాదియ్యా అంటూ రంగంలోకి దిగిపోయి పొంగల్ సీజన్ ని చక్కగా యుటిలైజ్ చేసుకున్నారు. సినిమా పరంగా సోగ్గాడే రేంజ్ లో బంగార్రాజు అవుట్ ఫుట్ రాకపోయినా సీజన్ అడ్వాంటేజ్ వల్ల కలెక్షన్స్ కి ఢోకా లేకుండా పోయింది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 36 కోట్లకి పైగా షేర్ రాబట్టుకున్న బంగార్రాజు 2002 సంక్రాంతి విన్నర్ గా నిలిచి ఇటు నాగార్జునకీ అటు జీ స్టూడియోస్ కీ హ్యాపీ ప్రాజెక్ట్ అయింది.
అయితే అన్నిచోట్ల మంచి షేర్లు సాధించిన బంగార్రాజు ఆటలు ఒక్క ఏరియాలో మాత్రం సాగలేదు. అదే నైజాం. మిగిలిన అన్ని కేంద్రాల్లోనూ బ్రేక్ ఈవెన్ అయిపోయి ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయిన బంగార్రాజు నైజాం ఏరియాలో మాత్రం సుమారు మూడు కోట్ల రూపాయల భారీ నష్టాన్ని మూటకట్టాడని చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు. ఎందుకంటే నైజాంలో బ్రేక్ ఈవెన్ కి బంగార్రాజు 11 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయాల్సి ఉండగా వసూళ్లు మాత్రం 8 కోట్ల దగ్గరే ఆగిపోయాయి. ఇకపై షేర్స్ వచ్చే అవకాశాలూ కనిపించకుండా పోయాయి. సో.. అంతంత మాత్రం టికెట్ రేట్స్ తోనే ఆంధ్రాలో కింగ్ అనిపించుకున్న నాగార్జునకి తెలంగాణాలో బంగారం లాంటి టికెట్ రేట్ల వెసులుబాటు ఉన్నా 'బంగార్రాజు'ని నైజాం నవాబ్ చెయ్యలేకపోయాడన్న మాట..!!