Advertisementt

జబర్దస్త్ ని తొక్కేయ్యడానికి ట్రై చేస్తున్నారా

Wed 26th Jan 2022 10:27 PM
jabardasth,star maa,etv,adhire abhi,jigel jeevan,comedy satars  జబర్దస్త్ ని తొక్కేయ్యడానికి ట్రై చేస్తున్నారా
Comedians abandoning Jabardasth జబర్దస్త్ ని తొక్కేయ్యడానికి ట్రై చేస్తున్నారా
Advertisement
Ads by CJ

గత తొమ్మిదేళ్లుగా ఈటీవీలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ లు. కామెడీ ప్రియులకుని అద్భుతంగా ఆకట్టుకుంటున్న ఈ జబర్దస్త్ ని తొక్కేసే ప్లాన్స్ నాగబాబు గారు మల్లెమాల నుండి విడిపోకముందే నుండే జరుగుతున్నాయి. స్టార్ మా కానివ్వండి, జీ తెలుగు కానివ్వండి.. చాలా కామెడీ షోస్ ప్లాన్ చేసినా.. అక్కడ ఏ ఒక్క షో సక్సెస్ అవ్వలేదు. నాగబాబు బయటికి వెళుతూ జబర్దస్ కమెడియన్స్ ని చాలామందిని లాగేసినా జబర్దస్త్ చెక్కు చెదరలేదు. కానీ ఈమధ్యన జబర్దస్త్ షో నుండి చాలామంది కమెడియన్స్ స్టార్ కి రావడానికి కారణం నాగబాబు అనే మాట వినబడుతుంది.

గతంలో తన కూడా చాలామందిని తీసుకెళ్ళినా, మరికొంతమంది టాప్ కమెడియన్స్ ని మాత్రం నాగబాబు లాగలేకపోయారు. కానీ రీసెంట్ గా స్టార్ మా కామెడీ స్టార్స్ కోసం నాగబాబు చాలామంది ఫామ్ లో ఉన్న కమెడియన్స్ ని లాగేసి స్టార్ మా కి తీసుకుపోయారని, నాగబాబు ఉన్నారనే ధైర్యం, స్టార్ మా పారితోషకాలకు చాలామంది జబర్దస్త్ కమెడియన్స్ జబర్దస్త్ వదిలి పోతున్నారు. ప్రస్తుతం జబర్దస్త్ లో ఆది, సుధీర్, శ్రీను, రామ్ ప్రసాద్, రాఘవ లాంటి వాళ్లకు తప్ప అందరూ కొత్త మొహాలే. అయినా ఆది, సుధీర్ లుకొత్త కమెడియన్స్ స్కిట్స్ లో గెస్ట్ రోల్స్ చేస్తూ జబర్దస్త్ ని నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. 

అదిరే అభి, జిగేల్ జీవన్, ఆర్పీ, అవినాష్ ఇలా చాలామంది కమెడియన్స్ ఇప్పుడు స్టార్ మా లో స్కిట్స్ వేసుకుంటున్నారు.

Comedians abandoning Jabardasth :

Jabardasth team leaders adhire abhi and jigel jeevan quit show

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ