ఆహా ఓటిటి స్టార్ట్ చేసాక. అందులో చిన్న చిన్న సినిమాలు, సమంత సామ్ జామ్ టాక్ షో, వంటల ప్రోగ్రామ్స్ ఇలా ఏదో అలా ఆలా నడుస్తుంది. ఆహా ఓటిటి కోసం విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ లు ప్రచార కర్తలుగా మారినా.. ఆహా కి వెయిట్ పెరగలేదు. కానీ అరవింద్ గారు నందమూరి నటసింహాన్ని తీసుకొచ్చి అన్ స్టాపబుల్ టాక్ షో మొదలు పెట్టగానే.. ఆహా కి సబ్ స్క్రైబర్స్ బాగా పెరిగారు. బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ షో విపరీతంగా క్లిక్ అయ్యింది. ప్రస్తుతం ఆ టాక్ అన్ని టాక్ షోస్ లో కెల్లా బాలయ్య అన్ స్టాపబుల్ నెంబర్ వన్ గా నిలిచింది. అయితే మొదటగా ఈ టాక్ షో ని వెంకటేష్ ని చెయ్యమని అడిగారట అల్లు అరవింద్ బ్యాచ్.
కానీ వెంకటేష్ టాక్ షో చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపించలేదట. ఎన్ని కోట్లు పారితోషకం ఇచ్చినా వెంకీ చెయ్యకపోయేసరికి అల్లు అరవింద్ బాలయ్య గడప తొక్కారట. ఇక అల్లు అరవింద్ బాలకృష్ణ ఆహా కోసం టాక్ షో చెయ్యమని అడగగానే.. చేస్తానని మాటిచ్చినా బాలయ్య.. నేను ఏం మాట్లాడితే అదే టాక్ షో, స్క్రిప్ట్ ప్రకారం అయితే నేను చెయ్యనని చెప్పారట. బాలయ్య కండిషన్స్ కి అల్లు అరవింద్ ఒప్పేసుకోవడం ఆహా టాక్ షో మొదలైపోవడం జరిగిపోయాయట. అలా వెంకీ వద్దనుకున్న షో ని బాలయ్య ఎత్తేశారన్నమాట.