Advertisementt

రవితేజ బర్త్ డే స్పెషల్ అప్ డేట్స్

Wed 26th Jan 2022 06:46 PM
ravi teja,ravi teja birthday special updates,ravi teja birthday special updates,khiladi movie,dhamaka movie,ravanasura movie,rama rao on duty movie  రవితేజ బర్త్ డే స్పెషల్ అప్ డేట్స్
Ravi Teja Birthday Special Updates రవితేజ బర్త్ డే స్పెషల్ అప్ డేట్స్
Advertisement
Ads by CJ

రవితేజ బర్త్ డే స్పెషల్ అప్ డేట్స్ 

మాస మహారాజ్ రవితేజ బర్త్ డే స్పెషల్ గా ఆయన నటిస్తున్న సినిమాల నుండి స్పెషల్ లుక్స్, స్పెషల్ సాంగ్, స్పెషల్ పోస్టర్స్ రివీల్ చేసి ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు మేకర్స్. ప్రస్తుతం రవితేజ చేతిలో ఏకంగా ఐదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో రెండు రిలీజ్ కి సిద్ధంగా ఉండగా.. మరో రెండు సినిమాలు రెగ్యులర్ షూటింగ్ తో బిజీగా వున్నాయి. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రాల నుండి ఆయన పుట్టిన రోజు ప్రత్యేకంగా వదిలిన అప్ డేట్స్ మీ కోసం.. 

మాస్ మహరాజా రవితేజ, రమేష్ వర్మ, సత్యనారాయణ కోనేరు ఖిలాడి నుంచి ఫుల్ కిక్కు పాట విడుదల

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రూపొందుతోన్న ఖిలాడీ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే  సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా రవితేజ బర్త్ డే సందర్భంగా ఫుల్ కిక్కు..అంటూ సాగే నాలుగో పాట లిరికల్ వీడియోను ఈ రోజు రిలీజ్ చేశారు.

ఈ మాస్ సాంగ్‌ కు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అధ్బుతమైన ట్యూన్ సమకూర్చారు. సాగర్, మమతా శర్మ ఈ పాటను ఫుల్ ఎనర్జీ తో ఆలపించారు. ఇక శ్రీమణి అందించిన సాహిత్యం మాస్‌ను ఆకట్టుకునేలా ఉంది. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొత్త స్టెప్పులు వేయించారు. ఇక రవితేజ, డింపుల్ హయతి కలిసి తమ డాన్స్ తో అభిమానులను ఫుల్ ఖుషీ చేశారు. లుంగిలో రవితేజ మాస్ స్టెప్పులు, తెరపై ఆయన ఎనర్జీ అభిమానులకు కన్నుల పండువగా ఉంది. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. రవితేజ సరసన మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌గా నటించారు.

మాస్ మహారాజ రవితేజ పుట్టిన రోజు సందర్భంగా రామారావు ఆన్ డ్యూటీ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల

మాస్ మహారాజా రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీ విడుదలకు సిద్దమవుతోంది. నేడు ఈ మూవీ సాంగ్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది.  

రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్లో రవితేజ విభిన్న ఎమోషన్స్లో కనిపిస్తున్నారు. ఒకచోట ఫ్యామిలీతో కనిపిస్తుండగా..మరోచోట ఆఫీస్ పనుల్లో  బిజీగా ఉన్నట్టు.. ఇంకోదాంట్లో యాక్షన్లోకి దిగేందుకు రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక మరో ఫోటోలో ట్రైన్ మంటల్లో కాలిపోతోండటం కూడా కనిపిస్తోంది. మొత్తానికి రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఎమోషన్స్ ఉన్నట్టు ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది.

ఈ చిత్రం యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్  పోస్టర్కు అద్బుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని మార్చి 25న విడుదల చేయాలని చిత్రయూనిట్ నిర్ణయించింది.

రవితేజ పుట్టినరోజు సందర్భంగా త్రినాథరావు నక్కిన, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ధమాకా నుంచి స్పెషల్ పోస్టర్ విడుద‌ల‌

మాస్ మహారాజ రవితేజ, త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా `ధమాకా` చిత్రం రాబోతోంది. డబుల్ ఇంపాక్ట్ అంటూ ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్‌తో ఈ మూవీ రూపొందుతోంది.  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరిస్తున్నారు.

రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రవితేజ  ట్రెండీ వేర్‌లో ఫుల్ఎనర్జీగా కనిపిస్తున్నారు. ఇక ఈ  డ్యాన్స్ మూమెంట్ ప్రేక్ష‌కుల‌ను  ఆకట్టుకునేలా ఉంది. మొత్తానికి ఈ స్పెష‌ల్ పోస్టర్ కలర్ ఫుల్‌గా ఉంది.

ఇంకా రవితేజ - సుధీర్ వర్మ కాంబోలో ఈమధ్యనే మొదలైన రావణాసుర నుండి రవితేజ కి స్పెషల్ పోస్టర్ తో బర్త్ డే విషెస్ తెలియజేసింది టీం.

Ravi Teja Birthday Special Updates:

Ravi Teja Birthday Updates

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ