టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి జంప్ అయ్యి అక్కడ పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా మారిన రకుల్ ప్రీత్ సింగ్.. గ్లామర్ షో సోషల్ మీడియాలో తరుచు చూస్తూనే ఉన్నాము. జిమ్ వేర్ అయినా, లేదంటే మ్యాగజైన్ కవర్ పిక్ అయినా, కాదు.. వెకేషన్స్ పిక్ అయినా.. రకుల్ ఏది షేర్ చేసినా అది ఇంటర్ నెట్ లో వైరల్ అవ్వాల్సిందే. బాలీవుడ్ కోసం సైజు జీరో ని మెయింటింగ్ చేస్తున్న రకుల్ ప్రీత్ గత ఏడాది తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కం హీరో అయిన జాకీ భగ్నానీ ప్రేమలో ఉన్న రకుల్.. పెళ్లి పేరు ఎత్తగానే ఫస్ట్ కెరీర్ తర్వాతే పెళ్లి అంటుంది.
కెరీర్ లో ఎంత బిజీగా వున్నా తన బాయ్ ఫ్రెండ్ జాకీ తో మాత్రం వెకేషన్స్ అలాగే.. రొమాంటిక్ డేట్స్ తో బాగా ఎంజాయ్ చేస్తుంది. తాజాగా ముంబై లో రకుల్ ప్రీత్ ఆమె బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ తో కలిసి రొమాంటిక్ డేట్ కి వెళ్లి మీడియాకి చిక్కింది. రకుల్ - జాకీ భగ్నానీ లు ఎంతగా రొమాంటిక్ డేట్ లో ఎంజాయ్ చేసారో కానీ.. వారిద్దరి ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.