మన తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ ఇటు ఇండస్ట్రీలోనూ అటు రాజకీయాల్లోనూ ఏకకాలంలో తమదైన పాత్ర పోషిస్తోన్న ఇద్దరే హీరోలు బాలకృష్ణ - పవన్ కళ్యాణ్. హీరోగా అఖండ విజయాలు సాధిస్తూ ఆహా అనిపించే టాక్ షో సైతం చేస్తోన్న బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా తన కర్తవ్యాలను కూడా అంతే నిబద్దతతో నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాదు బసవరామతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గానూ పలు సేవ కార్యక్రమాల్లో తన ధర్మం పాటిస్తారు. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించీ అందరికీ తెలుసు. తిరుగులేని పవర్ స్టార్ ఇమేజ్ తో హీరోగా కొనసాగుతూనే మరోవైపు జనసేన పార్టీ అధ్యక్షుడిగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, ప్రజల సమస్యలను పరిశీలిస్తూ రాజకీయ ప్రత్యమ్నాయంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇపుడు అకస్మాతుగ్గా వీరిద్దరి ప్రస్తావన ఎందుకూ అంటే... నేడు 73 వ గణతంత్ర వేడుకలను వీరిద్దరూ జరుపుకున్న తీరు జనాకర్షక రీతిలో ఉండడమే.!
బసవరామతారకం కాన్సర్ హాస్పిటల్ ప్రాంగణంలో జెండా వందనం చేసిన బాలయ్య ఆ వెంటనే ఆయన దైవ సమానులుగా భావించే తన తల్లిదండ్రుల విగ్రహాలకూ వందన సమర్పణ చేసారు. అలాగే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో మన జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఎల్లప్పుడూ తనలో తొణికిసలాడే దేశభక్తిని మరోసారి చాటుకున్నారు.