దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు వెంకటేష్ - వరుణ్ తేజ్ కాంబోలో ఎఫ్ 2 సీక్వెల్ గా ఎఫ్ 3 తెరకెక్కిస్తున్నాడు. అయితే అనిల్ రావిపూడి కి తన మొదటి సినిమా నుండి ఓ సెంటిమెంట్ ఉంది. అది ఆయన తన సినిమాల్లో నటించిన హీరోయిన్స్ ని తన నెక్స్ట్ మూవీస్ లో ఐటెం సాంగ్స్ లోకో, లేదంటే ఏదైనా స్పెషల్ కేరెక్టర్స్ కోసమో తీసుకుంటూ ఉంటారు. అలా హీరోయిన్స్ ని రిపీట్ చెయ్యడం వలన సినిమాకి మంచి మైలేజ్ వస్తుంది. అందుకే అనిల్ రావిపూడి అలా ఫాలో అవుతున్నారు. ఆయన ఫస్ట్ సినిమా పటాస్ హీరోయిన్ శృతి సోది ని తర్వాత సినిమా సుప్రీం లో ఐటెం సాంగ్ చేయించారు.
ఇక సుప్రీం హీరోయిన్ రాశి ఖన్నా, రవితేజ రాజా ధి గ్రేట్ లో కనిపించింది. రాజా ధి గ్రేట్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ని తన నెక్స్ట్ మూవీ ఎఫ్ 2 లో హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నాడు. ఎఫ్2 హీరోయిన్ తమన్నాని తదుపరి మహేష్ తో చేసిన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ఐటెం సాంగ్ చేయించాడు. మరి సరిలేరు నీకెవ్వరూ మూవీలో హీరోయిన్ గా నటించిన రష్మిక ని ఇప్పుడు ఎఫ్ 3 లో నటింప చెయ్యడానికి.. అంటే స్పెషల్ సాంగ్ అయినా, లేదంటే గెస్ట్ రోల్ కైనా రష్మికాని తీసుకురావాలని అనిల్ రావిపూడి అనుకుంటున్నారట.
మరి మొదటి నుండి తన సెంటిమెంట్ ని ఫాలో అయ్యి మళ్ళీ ఎఫ్ 3 తో హిట్ కొట్టాలని అనిల్ రావిపూడి ప్లాన్ అన్నమాట.