Advertisementt

సింగర్ సునీత భర్తకి కష్టాలు

Tue 25th Jan 2022 06:53 PM
singer sunitha,sunitha,ram,mango youtube channel,gowda cast,singer sunitha husband  సింగర్ సునీత భర్తకి కష్టాలు
Singer Sunitha husband in a controversy సింగర్ సునీత భర్తకి కష్టాలు
Advertisement
Ads by CJ

సింగర్ సునీత మొదటి భర్తతో విడాకులు తీసుకున్నాక తన పిల్లలతో కొన్నాళ్లుగా ఒంటరి జీవితాన్ని గడిపి.. గత ఏడాది జనవరిలో మ్యాంగో ఛానల్ రామ్ ని రెండో వివాహం చేసుకుంది. సింగర్ సునీత రెండో వివాహం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. పెళ్లి, దానికి ముందు చేసుకున్న పార్టీలు, పెళ్లి పనులు, అలాగే పెళ్లి తర్వాత సునీత హ్యాపీ నెస్ అన్నీ హైలెట్ అయ్యాయి. అయితే తాజాగా సునీత భర్త రామ్ ఇప్పుడు సమస్యల్లో పడ్డారు. రామ్ శ్రీనగర్ కాలనీలోని మ్యాంగో యూట్యూబ్ ఛానల్ ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అదే యూట్యూబ్ ఛానల్ వలన రామ్ సమస్యల్లో ఇరుక్కున్నారు.

ఎంటర్టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ తో మ్యాంగో ఛానెల్ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే రీసెంట్ గా  కొన్ని వీడియోలలో గౌడ మహిళలను వేశ్యలుగా చిత్రీకరించారంటూ రామ్ పై గౌడ కుల సంఘాలు మండిపడడమే కాదు.. మ్యాంగో యూట్యూబ్ ఛానల్ కార్యాలయాన్ని గౌడ కుల సంఘాలు చుట్టుముట్టి నానా రభసా చేసాయి. మా సామాజికవర్గ మహిళలను కించపరిచేలా తీసిన ఆ వీడియోలను వెంటనే డిలీట్ చేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని వారు రామ్ కి వార్నింగ్ ఇవ్వడమే కాదు.. ఈ విషయంలో రామ్ సారి చెప్పాలంటూ.. వారు డిమాండ్ చేసారు. ఈ విషయమై రామ్ స్పందించాల్సి ఉంది.  

Singer Sunitha husband in a controversy:

Singer Sunitha husband Ram in a controversy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ