Advertisementt

అల్లు అర్జున్ కి 2 కోట్లు, నానికి 20 వేలు

Tue 25th Jan 2022 05:35 PM
allu arjun,nani,pushpa movie,shyam singha roy movie,ar director  అల్లు అర్జున్ కి 2 కోట్లు, నానికి 20 వేలు
2 crores to Allu Arjun and 20 thousand to Nani అల్లు అర్జున్ కి 2 కోట్లు, నానికి 20 వేలు
Advertisement
Ads by CJ

ఒక్కో సారి ఆర్ట్ డైరెక్టర్స్ కొంచెం తెలివిగా కూడా అలోచించి చెయ్యాలి అంటారు. పుష్ప సినిమా చూసారు కదా, అందులో అల్లు అర్జున్ పోలీస్ లకి దొరక్కుండా ఎర్ర చందనం లారీని అదేనండి సరుకుతో వున్న లారీ ని ఒక బావిలోకి నెట్టేస్తాడు కదా. ఆ ఒక్క సీన్ కోసం మేకర్స్ ఏకంగా రెండు కోట్లు ఖర్చు పెట్టారని అంటున్నారు. బావి తవ్వి అందులోకి ఆ లారీని పోనిచ్చి అక్కడ దాచాను లారీని అని చెప్పడానికి రెండు కోట్లు ఖర్చు పెట్టారు. అయితే ఆ సినిమా బిగ్ బడ్జెట్ ఆ సినిమా నిర్మాతలు కూడా భారీ నిర్మాతలు కదా, అందుకే ఒక చిన్న సీన్ కోసం అంత ఎక్కువ ఖర్చు పెట్టారు.

అదే నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ చూసారు కదా. అందులో నాని ఒక దళితున్ని బావిలో పడేసే సీన్ వుంది కదా, దానికి అయిన ఖర్చు ఎంతో తెలుసా, అక్షరాలా ఇరవయి వేలు. అవునండి, అంతే ఖర్చు అయ్యిందట. అది కూడా ఒక సెట్ అని తెలుస్తుంది. చిన్న ఆర్ట్ వర్క్ తో సి జి కలిపితే ఆ సీన్ వచ్చిందని.. అది కూడా ఎంతో సహజంగా వచ్చింది ఆ సీన్ అంటున్నారు./ మరి అల్లు అర్జున్ రేంజ్ కి 2 కోట్లు పెడితే.. నాని రేంజ్ కి 20 వేలు పెట్టారన్నమాట. అదే తేడా!

2 crores to Allu Arjun and 20 thousand to Nani:

Allu Arjun and Nani movie comparison

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ