Advertisementt

గప్ చుప్ గా రాధేశ్యామ్ టీం

Tue 25th Jan 2022 12:11 PM
radhe shya,prabhas,pooja hegde,r adhakrishna,rrr movie,bollywood movies  గప్ చుప్ గా రాధేశ్యామ్ టీం
Radhe Shyam gets a new tentative release date గప్ చుప్ గా రాధేశ్యామ్ టీం
Advertisement
Ads by CJ

సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. యువి క్రియేషన్స్ లో రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన రాధేశ్యామ్ పై మంచి అంచనాలున్నాయి. పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలున్న రాధేశ్యామ్ మూవీ రిలీజ్ డేట్ వాయిదా వేసి చాలా రోజులైన కొత్త రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ఇవ్వలేదు. మరోపక్క రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కోసం కచ్చిఫ్ వేసి మరీ రెండు డేట్స్ లాక్ చేసి పెట్టారు. అన్నీ అనుకూలంగా ఉంటే మార్చ్ 18, పరిస్థితులు అనుకూలించకపోతే ఏప్రిల్ 28 అంటూ రెండు డేట్స్ లాక్ చేశారు. 

మరి రాధేశ్యామ్ టీం మాత్రం మరో డేట్ విషయం ప్రస్తావించడం లేదు. మేకర్స్ ఎప్పటిలాగే సైలెంట్ గా ఉన్నట్టుగా ఇప్పుడు కూడా ఉన్నారు. కొత్త డేట్ ఇద్దాం, ప్రమోషన్స్ మొదలు పెడదాం అని అనుకోవడం లేదు. కరోనా టైం లో కామ్ గా ఉంటేనే బెటర్. కొద్దిగా శాంతించక, థియేటర్స్ ఓపెన్ అన్న టైం లో డేట్ ఇద్దామనుకుంటే.. అటు బాలీవుడ్ నుండి పోటీ మొదలైపోతోంది. ఎందుకంటే అక్కడ రిలీజ్ అవ్వాల్సిన చాలా పెద్ద సినిమాలు ప్రస్తుతం పోస్ట్ పోన్ అయ్యాయి. ఇప్పుడు థియేటర్స్ తెరుచుకున్నాయంటే బాలీవుడ్ బడా సినిమాలు పొలోమంటాయి. అప్పుడు రాధేశ్యామ్ ఇరుక్కుపోతుంది. అందుకే ముందుగా మేల్కొంటే బెటర్.

Radhe Shyam gets a new tentative release date:

Radhe shyam new reelase date locked?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ