అక్కినేని అఖిల్ దర్శకుడు సురేందర్ రెడ్డి తో చేస్తున్న ఏజెంట్ సినిమా ప్రస్తుతం షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. ఆమధ్య సురేందర్ రెడ్డి కరోనా బారిన పడటం, షూటింగ్ ఆగిపోవటం మళ్ళీ ఆ తరువాత షూటింగ్ జరగలేదు. తొందరేముంది ఏలాగూ షూటింగ్ ఆపేశాం కదా, తాపీగా చేద్దాం అనుకున్నారు. పోనీ అలా అనుకున్నాక, ఊరుకుంటారా, కథలో మార్పులు చెయ్యడం మొదలెట్టారు. ఏంటో పాపం అఖిల్ కి అన్ని అరిష్టాలే. అంతకు ముందు కూడా మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ కి కూడా ఇలానే అయింది. సినిమా బాగా డిలే అయింది. ఇప్పుడు ఈ ఏజెంట్ కి కూడా అలానే అవుతోంది.
ఏజెంట్ షూటింగ్ లేకపోయినా అఖిల్ ఆ బాడీ ని మైంటైన్ చేస్తూ ఉండాలి, అది కొంచెం కష్టమే. దానికి తోడు ఇప్పుడు మళ్ళీ కరోనా ఉదృతి ఎక్కువగా ఉండటంతో, ఒకసారి దాని బారిన పడ్డ సురేందర్ రెడ్డి, మళ్ళీ ఈ టైం లో షూటింగ్ ఎందుకు తగ్గాక చేద్దాం అన్నాడట. సో అందుకని అఖిల్ ఏజెంట్ మళ్ళీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చెప్పలేం.