రాజమౌళి, సుకుమార్, పూరి జగన్నాధ్, క్రిష్, సుజీత్, రాధాకృష్ణ ఇలా చాలామంది తెలుగు దర్శకులు పాన్ ఇండియా దర్శకులు అయిపోతున్నారు. అంటే వాళ్ళు చేసే సినిమాలు తెలుగు లో కాకుండా ఇతర భాషల్లో కూడా విడుదల అవుతున్నాయి. నిన్న కాక మొన్న వచ్చిన రాహుల్ సాంకృత్యాన్ కూడా తన శ్యామ్ సింగ రాయ్ ని ఇతర భాషల్లో విడుదల చేసి పాన్ ఇండియా దర్శకుడు అయిపోయాడు. మరి అగ్ర దర్శకుల్లో ఒకరు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంతవరకు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేకపోయారు. ఎందుకో మరి.
త్రివిక్రమ్ ఎప్పుడూ సౌత్ కి పరిమితం అయ్యే కథలనే ఎంచుకుంటున్నారు. అతని లాస్ట్ సినిమా అలా వైకుంఠపురం లో కూడా పెద్ద హిట్ అయింది కానీ, ఒక్క తెలుగు లోనే బాగా ఆడింది. పాన్ ఇండియా సినిమా అవలేకపోయింది. ఇప్పుడు పుష్ప హిట్ అయ్యాక, అల్లు అర్జున్ పాత సినిమాలు, హిందీ లో డబ్ చేస్తున్నారు. అందులో అలా వైకుంఠపురం లో కూడా ఒకటి. మరి త్రివిక్రమ్ ఎందుకు పాన్ ఇండియా కథ రాయలేకపోతున్నారు? అతని తదుపరి సినిమా కూడా మహేష్ బాబు తో వుంది. మహేష్ సినిమాలు ఏవి పాన్ ఇండియా కాదు, తెలుగు కె ఎక్కువ పరిమితం, మరీ అయితే సౌత్ ఇండియా లో విడుదల అవుతాయి. త్రివిక్రమ్ మరి పాన్ ఇండియా దర్శకుడు ఎప్పుడు అవుతారో? అవ్వాలంటే అందరికి సరిపడా కథలు ఎంచుకోవాలి. అలా చేస్తారా మరి త్రివిక్రమ్?