Advertisementt

మహేష్ కి నచ్చనిది.. విజయ్ మెచ్చాడు.!

Mon 24th Jan 2022 10:11 PM
vijay,dil raju,vamsi paidipally,thalapathy 66 update,thalapathy 66  మహేష్ కి నచ్చనిది.. విజయ్ మెచ్చాడు.!
Mahesh did not like it, Vijay liked it very much మహేష్ కి నచ్చనిది.. విజయ్ మెచ్చాడు.!
Advertisement
Ads by CJ

దిల్ రాజు ఈమధ్యన టాలీవుడ్ సినిమాలతో పాటుగా పాన్ ఇండియా మూవీస్, బాలీవుడ్ మూవీస్ ని నిర్మించేస్తూ పెద్ద ప్రొడ్యూసర్ అయ్యారు. ఒకప్పుడు అన్నిటికి లెక్కలు వేసుకుని బడ్జెట్ పెట్టే దిల్ రాజు చాలా వరకు మారిపోయారు. కాబట్టే పెద్ద దర్శకులతో, స్టార్ హీరోలతో పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ తో మూడు భషాల్లో ఓ మూవీ, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో మరో పాన్ ఇండియా ఫిలిం చేస్తున్నారు దిల్ రాజు. అయితే దిల్ రాజు - విజయ్ కాంబోలో వంశి పైడిపల్లి మూవీ షూటింగ్ మొదలు కాకుండానే.. ఆ సినిమా కథ పై అందరిలో ఇంట్రెస్ట్ రేకెత్తిస్తున్నారు.

అది కూడా స్టార్ హీరో విజయ్ తన 20 ఏళ్ళ కెరీర్ లో ఇంతవరకు వంశి చెప్పిన కథలాంటి కథ వినలేదు.. ఇది స్పెషల్ ప్రాజెక్ట్ అని, అద్భుతమైన స్టోరీ అంటూ తెగ ఇదైపోతున్నాడు దిల్ రాజు. మరి ఆ కథ సూపర్ స్టార్ మహేష్ రిజెక్ట్ చేసిన కథే అంటూ ప్రచారం జరుగుతున్న వేళ విజయ్ కి అంతలా ఆ కథ లో ఏం నచ్చిందో అంటున్నారు మహేష్ ఫాన్స్. ఎందుకంటే దిల్ రాజు - వంశి పైడిపల్లి కలిసి మహర్షి తర్వాత మహేష్ తో సినిమా చెయ్యాలని చూస్తే.. మహేష్ కి వంశి చెప్పిన కథ నచ్చలేదు. సో అదే కథతో విజయ్ ని ఒప్పించారు. మరి ఆ కథ లాంటి కథ విజయ్ తన 20 ఏళ్లలో వినలేదు అన్నారట. అంటే.. అందులో అంత స్పెషల్ ఏముందో అంటూ మహేష్ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు పెట్టి.. ఈ ఏడాది దివాళి కి రిలీజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామంటూ దిల్ రాజు.. Thalapathy66 ప్రాజెక్ట్‌ పై అప్ డేట్ ఇచ్చేసారు. 

Mahesh did not like it, Vijay liked it very much:

Thalapathy 66 update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ