Advertisementt

అల్లుతున్నారా.. అల్లుకుపోతున్నాడా..?

Mon 24th Jan 2022 03:48 PM
allu arjun atlee combination,allu arjun in the direction of atlee  అల్లుతున్నారా.. అల్లుకుపోతున్నాడా..?
Gossips on Allu Arjun Next Film అల్లుతున్నారా.. అల్లుకుపోతున్నాడా..?
Advertisement
Ads by CJ

అల వైకుంఠపురంలో అంటూ బ్లాక్ బస్టర్ ఇచ్చి ఐకాన్ స్టార్ అయిపోయిన అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. బాహుబలితో ప్రభాస్, కె.జి.ఎఫ్ తో యష్ ఎలా అయితే నార్త్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసారో అదే స్థాయిలో పుష్పగా బన్నీ కూడా బాలీవుడ్ ని దున్నేస్తున్నాడు. దాంతో అమాంతం అల్లు అర్జున్ క్రేజ్ పదింతలు పెరిగింది. తన రాబోయే సినిమాల బిజినెస్ ఒక్కసారిగా మూడింతలు ముందుకు వెళ్ళింది. మరి పుష్పగా సెకండ్ పార్ట్ లో రూల్ చేయనున్న బన్నీ ఆ తర్వాత చేయబోయే ప్రాజెక్ట్స్ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే ఉంటాయి అనడంలో సందేహం లేదు కానీ సడెన్ గా స్ప్రెడ్ అయినా ఓ న్యూస్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. 

తమిళ్ సూపర్ స్టార్ విజయ్ కి వరుస విజయాలను అందించిన అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా ఓ భారీ పాన్ ఇండియా ఫిలిం ప్లాన్ చేస్తోందట అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. ఈ వెంచర్ కోసం బన్నీ కి సెంచరీ సిఆర్ ఆఫర్ ఇచ్చారనీ, కథ చెప్పి ఒప్పించేందుకు అట్లీ సిద్ధంగా ఉన్నాడనీ కథనాలు వెలువడుతున్నాయి. ఇవన్నీ అల్లు ఆర్మీ అని చెప్పుకునే అభిమానులు అల్లుతున్నారా లేక అందివచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ని ఖచ్చితంగా కొనసాగించే థాట్ తో అల్లు అర్జునే మంచి కాంబినేషన్స్ ఎంచుకుని అల్లుకుపోతున్నాడా అనేది అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తే తెలుస్తుంది. 

Gossips on Allu Arjun Next Film:

Allu Arjun - Atlee Combo

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ