Advertisementt

సూపర్ హిట్ కొట్టి.. రెట్టించిన ఉత్సాహంతో..

Mon 24th Jan 2022 12:16 PM
nani,vivek athreya,mythri movie makers,ante sundaraniki movie,ante sundaraniki shooting wrapped up  సూపర్ హిట్ కొట్టి.. రెట్టించిన ఉత్సాహంతో..
Nani Ante Sundaraniki Shooting Wrapped Up సూపర్ హిట్ కొట్టి.. రెట్టించిన ఉత్సాహంతో..
Advertisement
Ads by CJ

నేచురల్ స్టార్ నాని గత ఏడాది రిలీజ్ చేసిన టక్ జగదీశ్ యావరేజ్ టాక్ తెచ్చుకోగా.. శ్యామ్ సిగ్ రాయ్ మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. నాలుగు భాషల్లో రిలీజ్ అయిన శ్యామ్ సింగ రాయ్ నానికి సూపర్ హిట్ ఇచ్చింది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా సినిమాలు చేసే నాని  28వ చిత్రం అంటే  సుందరానికీ.. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ సినిమా ని నిర్మిస్తోంది. రోమ్-కామ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని వేసవిలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ సంద‌ర్భంగా  ఈ సంవత్సరం రోలర్ కోస్టర్ చిత్రం షూటింగ్ పూర్తయింది. అంటే సుందరానికి.. అని నాని, సినిమా సెట్స్ లో చివరి రోజు తీసిన ఒక వీడియోను సోష‌ల్‌మీడియా ద్వారా పంచుకున్నారు.

నూతన సంవత్సరం సందర్భంగా  విడుద‌లైన అంటే సుందరానికీ.. ఫస్ట్ లుక్ లో నాని తన విలక్షణమైన ఫన్నీ లుక్ తో ఆశ్చర్యపరిచాడు. ఫ‌స్ట్ లుక్‌తోనే ఇదొక డిఫ‌రెంట్ మూవీ అని తెలియ‌జేశారు నాని.  ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో  కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్అనేది నాని పాత్ర పేరు. ఈ సినిమాలో నాని కి జోడిగా మలయాళ బ్యూటీ నజ్రియా నటిస్తుంది.

Nani Ante Sundaraniki Shooting Wrapped Up:

Nani, Vivek Athreya, Mythri Movie Makers Ante Sundaraniki Shooting Wrapped Up

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ