Advertisementt

భీమ్లా నాయక్ అంచనాలు రెట్టింపు చేసారు

Sun 23rd Jan 2022 09:26 PM
thaman,bheemla nayak,pawan kalyan,rana,trivikram,bheemla nayak rushes  భీమ్లా నాయక్ అంచనాలు రెట్టింపు చేసారు
Bheemla Nayak will be Pawan Kalyan best film till date: Thaman SS భీమ్లా నాయక్ అంచనాలు రెట్టింపు చేసారు
Advertisement
Ads by CJ

అన్ని అనుకూలంగా ఉంటే.. పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఈపాటికి పండగ చేసుకునేవారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ ఈ సంక్రాంతి కి రిలీజ్ చెయ్యాల్సింది. మేకర్స్ ఆర్.ఆర్.ఆర్ వలన వెనక్కి తగ్గితే.. కరోనా కాపాడింది. అందుకే ఫిబ్రవరి 25 న భీమ్లా నాయక్ రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈ సినిమాపై పాన్ ఇండియా మూవీ కి ఉన్నంత అంచనాలు, క్రేజ్ ఉన్నాయి. అందుకే భీమ్లా నాయక్ నుండి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా పవన్ ఫాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.

ఈ సినిమాకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పని చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన భీమ్లా నాయక్ సాంగ్స్ మాస్ ఫాన్స్ కి విపరీతంగా ఎక్కేశాయి. తాను ఈ సినిమాకి బెస్ట్ ట్యూన్స్ ఇవ్వడానికి ప్రయత్నించాను అంటూ ఎప్పటికప్పుడు సినిమాపై అంచనాలు పెంచుతున్న థమన్ తాజాగా.. తాను దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి భీమ్లా నాయక్ రషెస్ చూశానని, పవన్ కెరీర్‌లో భీమ్లా నాయక్ బెస్ట్ సినిమా అవుతుందని చెప్పడంలో సందేహం లేదంటూ ఇప్పటివరకు  ఉన్న అంచనాలు అమాంతం పెంచేసాడు థమన్. భీమా నాయక్ గా పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా పవన్, ఈగో పర్సనాలిటీగా రానా కనిపించబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ మెల్లిగా మొదలు పెడుతున్నారు మేకర్స్. 

Bheemla Nayak will be Pawan Kalyan best film till date: Thaman SS:

Thaman: Bheemla Nayak is Pawan Kalyan career-best film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ