Advertisementt

ఊ అంటావా చై.. ఉ ఊఁ అంటావా చై.?

Sun 23rd Jan 2022 06:18 PM
naga chaitanya in maanaadu remake,suresh productions doing maanaadu remake  ఊ అంటావా చై.. ఉ ఊఁ అంటావా చై.?
Naga Chaitanya in Dilemma ఊ అంటావా చై.. ఉ ఊఁ అంటావా చై.?
Advertisement
Ads by CJ

లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో వరుస విజయాలు నమోదు చేసి హ్యాట్రిక్ కోసం త్వరలో థాంక్ యు చెప్పబోతున్నాడు నాగ చైతన్య. అంతేకాదు ఏప్రిల్ 14న విడుదల కానున్న ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా మూవీతో బాలీవుడ్ ఆడియన్స్ కీ ఇంట్రడ్యూస్ కాబోతున్నాడు. ఇలా కెరీర్ వైజ్ మంచి ఎక్సయిటింగ్ ఫేజ్ ఎంజాయ్ చేస్తోన్న చైతూని ఇరకాటంలో పెడుతూ తన కోర్ట్ లోకి ఓ బాల్ వేసారట సురేష్ బాబు. ఆ డీటైల్స్ లోకి వెళితే... 

రీసెంట్ గా తమిళ్ లో సూపర్ హిట్ అయిన శింబు మానాడు రీమేక్ రైట్స్ తీసుకున్నారు సురేష్ బాబు. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో ఎంగేజింగ్ థ్రిల్లర్ గా రూపొందిన మానాడుని నాగ చైతన్యతో రీమేక్ చేద్దామనే ప్లాన్ లో ఉన్నారు. బట్ ప్రాబ్లెమ్ ఏమిటంటే నిజానికి ఈ సినిమా తెలుగులో డబ్బింగ్ వెర్షనే రిలీజ్ కావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల కాలేకపోవడం, సినిమా తమిళ్ లో స్ట్రాంగ్ హిట్టుగా నిలబడడంతో సూపర్ మైండ్ సురేష్ బాబు అప్పటికప్పుడు రీమేక్ రైట్స్ తీసేసుకున్నారు. కానీ.... ఆపై తెలుగు ఆడియో స్ట్రీమింగ్ తో సహా ఓటీటీలోకి వచ్చేసింది మానాడు. అది అశ్రద్ధ వల్ల జరిగిందా, అనివార్య కారణాల వల్ల జరిగిందా అనేది పక్కన పెడితే అవ్వాల్సిన డామేజ్ అయిపోయింది. ఆసక్తి వున్నవాళ్లు ఆల్రెడీ చూసేసారు. ఆఫ్ కోర్స్ ఇంకా చూస్తున్నవాళ్లూ వున్నారు. ఇదంతా తనకీ తెలిసే వుంటుంది కనుక మరీ నేపథ్యంలో మేనమామ మాట కాదనలేక చై ఊ అంటాడా, మొహమాటం పక్కనెట్టి ఉ ఊఁ అంటాడా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్...!! 

Naga Chaitanya in Dilemma:

Maanaadu remake in suresh productions

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ