ఆర్.ఆర్.ఆర్ విడుదల తర్వాతనే ఆచార్య రిలీజ్ ఉండాలనే రాజమౌళి అభ్యర్ధనతో ఇప్పటికే పలుమార్లు తన సినిమా వాయిదా వేసుకుంటూ వచ్చారు చిరంజీవి. ఫైనల్ అనుకున్న ఫిబ్రవరి 1 డేట్ కూడా పోస్టుపోన్ చేసుకుని ఏప్రిల్ 1 కి వద్దాం అనుకుంటే ఇపుడు ఏప్రిల్ 28 తేదీపై కన్నేశారు రాజమౌళి. అంటే ఆచార్య మళ్ళీ మేకి షిఫ్ట్ అవ్వాలన్నమాట. కానీ ఈసారి అందుకు అంగీకరించలేదట చిరంజీవి. ఓవైపు డిస్ట్రిబ్యూటర్స్ మరోవైపు థియేటర్స్ వాళ్ల ఒత్తిడి మేరకు ఏప్రిల్ 1కే వస్తామని మాట ఇచ్చిన మెగాస్టార్ అదే విషయాన్ని రాజమౌళికి స్పష్టంగా చెప్పెయ్యడం జరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం. మరి ఇన్నిసార్లు ఆచార్యని పోస్టుపోన్ చేయించిన రాజమౌళి ఈసారి తనే ప్రీపోన్ కి సిద్ధపడి మార్చ్ 18కే వచ్చేస్తారా... లేక ఆచార్యకు దారిచ్చేసి ఏప్రిల్ 28కే ఫిక్స్ అవుతారా అనేది తేలాల్సి వుంది.
అలాగే ఈ రిలీజ్ డేట్స్ మ్యాటర్ పక్కన పెడితే స్పష్టత రావాల్సిన మరో రెండు అంశాలు..... కరోనా ఉధృతి తగ్గడం, ఆంధ్రాలో టికెట్ రేట్లు పెరగడం. ముందు ఈ రెండిటి నుంచి రిలీఫ్ వస్తేనే ఏ పెద్ద సినిమా అయినా రిలీజ్ కి వచ్చేది..!