ప్రస్తుతం వున్న నటుల్లో మూడు నాలుగు సినిమాలతో బిజీ గా వున్నవాళ్లలో రవి తేజ ఒకరు. రెండు సినిమాలు పూర్తి అయ్యి విడుదలకి సిద్ధంగా వున్నాయి, ఈలోపు ఇంకో సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేసేసాడు. ఇంకో రెండు సినిమాలు కూడా ఒప్పేసుకున్నాడు. అదేంటి సినిమా విడుదల అవ్వకుండానే, వరస సినిమాలు చేసేసుకుంటూ పోతున్నాడు అంటే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న విధంగా చేస్తున్నాడు రవి తేజ. సినిమా విడుదల ఎప్పుడయినా అవుతుంది, కానీ అవకాశం వచ్చినప్పుడే నాలుగు డబ్బులు చేసుకోవాలి కదా అనే స్ట్రాటజీ లో వున్నాడు రవి తేజ.
వయసు కూడా అయిపోతోంది, ఇప్పుడు సినిమా హాల్స్ తెరుచుకోలేదు, సినిమాలు తరువాత చేద్దాం అనుకుంటే, మళ్ళీ ఆ అవకాశాలు రావాలి కదా. అందుకే వచ్చిన వెంటనే ఒప్పేసుకుంటున్నాడు, డబ్బులు చేసుకుంటున్నాడు. ఇవన్నీ కాకుండా చిరంజీవితో కూడా ఒక సినిమా ఒప్పుకున్నాడు, అది కూడా మంచి రెమ్యూనరేషన్ వస్తోందని, ప్లస్ చిరంజీవి తో అంటే, ఆ మైలేజీ చాలా పెద్దగా వస్తుంది. ఏమైనా రవి తేజ స్ట్రాటజీ బాగుంది, డబ్బులుకి డబ్బులు, సినిమాలకి సినిమాలు. మరి ఈ సంవత్సరం ఎన్ని సినిమాలు విడుదల చేస్తాడో చూడాలి. వయసులో వున్నప్పుడే కదా ఎంతైనా చెయ్యగలం.