Advertisementt

ఇక జబర్దస్త్ పని అవుట్

Sat 22nd Jan 2022 10:03 PM
comedy stars,jabardasth,comedy stars dhamaka,star maa,extra jabardasth  ఇక జబర్దస్త్ పని అవుట్
Jabardasth Comedy show out ఇక జబర్దస్త్ పని అవుట్
Advertisement
Ads by CJ

జబర్దస్త్ ని కొట్టాలి, కొట్టాలి అని గత తొమ్మిదేళ్లుగా పక్క ఛానల్స్ చేసిన ప్రయత్నాలన్నీ వృధాగా మిగిలిపోయాయి. ఈటీవీలో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ కామెడీ ప్రియులని కట్టిపడేసిన జబర్దస్త్ కి ఇప్పుడు గడ్డుకాలం మొదలైంది. నిన్నమొన్నటివరకు ఎదురు లేదు అనుకున్న జబర్దస్త్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. ఇప్పటివరకు జబర్దస్త్ కి ఎదురు నిలిచిన ప్రోగ్రామ్స్ అన్ని గాల్లో కలిసిపోయినా.. ఇప్పుడు స్టార్ మాలో వస్తున్న కామెడీ స్టార్స్ జబర్దస్త్ కి చెక్ పెట్టేసింది. 

మల్లెమాల కి పోటీగా నాగబాబు ఎన్ని చేసినా, ఏం చేసినా వర్క్ అవుట్ అవలేదు. కానీ స్టార్ మా మాత్రం మల్లెమాలకి దిమ్మతిరిగే షాకిచ్చేసింది. కామెడీ స్టార్స్ అంటూ శేఖర్ మాస్టర్, నాగబాబు జెడ్జెస్ గా దీపికా పిల్లి యాంకర్ గా, అదిరే అభి, ముక్కు అవినాష్ లాంటి టీం లీడర్స్ తో కొత్తగా కామెడీ స్టార్స్ ప్రోగ్రాం రేజ్ అయ్యింది. కేవలం సండే ప్రసారం అవుతున్న ఈ ప్రోగ్రాం కి జబర్దస్త్ కమెడియన్స్ వచ్చేస్తున్నారు. మల్లెమాలకి హ్యాండ్ ఇచ్చేసి స్టార్ మా కి ఎంట్రీ ఇస్తున్నారు. జబర్దస్త్ లో కమేడియన్స్ ని మల్లెమాల అగ్రిమెంట్స్ తో కట్టెయ్యడంతోనే.. అగ్రిమెంట్స్ పూర్తి చేసుకుని ఇలా స్టార్ కి జంప్ అవుతున్నారు, అందుకే జబర్దస్త్ లో కూడా కొత్త కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు. సో జబర్దస్త్ పని ఇక ఖాళీ..

Jabardasth Comedy show out:

Comedy Stars Dhamaka to premiere on January 23

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ