Advertisementt

అన్న కుటుంబానికి మహేష్ పరామర్శ

Sat 22nd Jan 2022 06:22 PM
mahesh babu,brother ramesh babu,ramesh babu residence,corona,covid 19,corona virus  అన్న కుటుంబానికి మహేష్ పరామర్శ
Mahesh Babu goes to his brother Ramesh Babu residence అన్న కుటుంబానికి మహేష్ పరామర్శ
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ మోకాలి ఆపరేషన్ తర్వాత దుబాయ్ లో కాస్త రెస్ట్ తీసుకుని హైదరాబాద్ కి రాగానే కరోనా బారిన పడ్డారు. దానితో ఆయన నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ కూడా వాయిదా పడింది. అయితే మహేష్ కోవిడ్ బారిన పడిన టైంలోనే మహేష్ బాబు అన్నగారు రమేష్ బాబు అకాల మరణం చెందారు. మహేష్ కి కరోనా ఉండడంతో.. రమేష్ బాబు అంత్య క్రియలని నమ్రత దగ్గరుండి చూసుకున్నారు. ఇక ఈమధ్యే మహేష్ బాబు కరోనా నుండి కోలుకున్నారు.

కరోనా నుండి కోలుకున్న మహేష్ తన అన్న రమేష్ బాబు 11th డే సెర్మొనీ కి ఆయన ఇంటికి వెళ్లారు. అన్నయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకై రమేష్ బాబు ఇంటికి మహేష్ వెళ్లిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ పక్క మహేష్ బాబు కరోనా నుండి కోలుకోవడం ఆయన అభిమానులకి ఆనందాన్ని ఇచ్చింది. ఇక మహేష్ బాబు తన అన్న రమేష్ బాబు కి మధ్యన ఎంతో అనుబంధం ఉండేది. కృష్ణగారు షూటింగ్ కి వెళ్ళినప్పుడు రమేష్ బాబే మహేష్ ని దగ్గరుండి చూసుకునేవారు. మహేష్ కి అన్న అంటే ప్రాణం. ఆయన మరణించిన సమయంలో మహేష్ అన్నని కడసారి చూసుకోలేకపోయారు. ఆ సందర్భంగా అప్పటికి ఐసొలేషన్ లో వున్న మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా తన వేదనను వ్యక్తపరిచారు. ఎంతో భావోద్వేగభరితంగా సాగిన ఆ సందేశం అందర్నీ కదిలించిన సంగతి తెలిసిందే. 

Mahesh Babu goes to his brother Ramesh Babu residence:

Mahesh Babu visits  his brother Ramesh Babu residence

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ