Advertisementt

ఆచార్య విడుదల తేదీ మళ్ళీ మారుతుందా?

Sat 22nd Jan 2022 06:13 PM
rrr,acharya,acharya release plan,chiranjeevi,rajamouli,acharya release date  ఆచార్య విడుదల తేదీ మళ్ళీ మారుతుందా?
Will Acharya release date change again? ఆచార్య విడుదల తేదీ మళ్ళీ మారుతుందా?
Advertisement
Ads by CJ

మెగా స్టార్ చిరంజీవి నటించిన ఆచార్య విడుదల తేదీ ఫిబ్రవరి నాలుగు నుండి ఏప్రిల్ ఒకటో తేదీకి మారినట్లుగా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ట్రిపిల్ ఆర్ కూడా రెండు తేదీలతో తమ సినిమా విడుదల ప్రకటించారు. ఒకటి మార్చ్ 18 న అని రెండోది ఏప్రిల్ 28 అని. మొదటి తేదీతో చిరంజీవి గారికి ఎటువంటి సమస్య లేదు, కానీ ఒకవేళ ఆ తేదీకి ట్రిపిల్ ఆర్ కనక రాకపోతేనే ఇబ్బంది. ఎందుకంటే ట్రిపిల్ ఆర్ కనక ఏప్రిల్ 28 వ తేదీకి కి గనక వస్తే, అప్పుడు చిరంజీవి గారు తన ఆచార్య సినిమాని మే లో విడుదల చేయాల్సి ఉంటుంది. 

ఎందుకంటే ట్రిపిల్ ఆర్ తరువాతే తన సినిమా విడుదల ఉంటుంది అని ఇంతకు ముందు మెగాస్టార్ చిరు చాలాసార్లు అన్నారు. మరి మెగాస్టార్ అనుకున్న విధంగా రావాలి అంటే, రెండు సినిమా టీం లకి సంబందించిన వాళ్ళు కరోనా ఉదృతి తగ్గి సినిమా హాల్స్ అన్నీ ఓపెన్ చెయ్యాలని ఆ భగవంతుని ప్రార్థన చెయ్యటమే. లేకపోతే మళ్ళీ విడుదల తేదీలు అన్ని సినిమాలు మార్చు కోవాలి. ఇప్పుడు టెన్షన్ ఒక్క ట్రిపిల్ ఆర్ కె కాదు, చిరంజీవి గారికి కూడా. 

Will Acharya release date change again?:

RRR to affect Acharya release plan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ