Advertisementt

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి టీజర్

Sat 22nd Jan 2022 05:01 PM
sudheer babu,krithi shetty,mohanakrishna indraganti,mythri movie makers,benchmark studios,aa ammayi gurinchi meeku cheppali teaser,aa ammayi gurinchi meeku cheppali movie  ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి టీజర్
Aa Ammayi Gurinchi Meeku Cheppali Teaser Unleashed ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి టీజర్
Advertisement
Ads by CJ

శ్రీదేవి సోడా సెంటర్ హిట్ తర్వాత సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్లు విడుదల చేశారు. ఈ సినిమాలో సుధీర్ బాబు కమర్షియల్ ఫిల్మ్ మేకర్‌గా కనిపించబోతోన్నారు. టీజర్‌లో సుధీర్ బాబు వరుసగా ఆరేళ్లు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన దర్శకుడిగా పరిచయం అవుతారు. తన గెలుపుపై సుధీర్ బాబు ఎంతో గర్వంగా ఫీలవుతుంటారు. కానీ పక్కనే ఉన్న స్నేహితులు మాత్రం రొటిన్ సినిమాలు తీస్తున్నావేంటని అంటుంటారు. డాక్టర్ అలేఖ్య పాత్రలో కృతి శెట్టి కనిపించింది. ఈమెకు సినిమాలంటే నచ్చవు. ఈ ఇద్దరివి భిన్న రుచులు, మనస్తత్వాలు, ఆలోచనలే అయినా ప్రేమ చిగురిస్తుంది. ఆమెతోనే హీరోయిన్ సెంట్రిక్ మూవీని తీసేందుకు ప్రయత్నిస్తాడు. టీజర్‌తో సినిమాపై అంచనాలు పెంచేశారు దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి. ఇందులో సుధీర్ బాబు, కృతి శెట్టి కెమిస్ట్రీ హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. పీజీ విందా కెమెరా పనితనం, వివేక్ సాగర్ అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. మొత్తానికి టీజర్‌తో సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది.

Aa Ammayi Gurinchi Meeku Cheppali Teaser Unleashed:

Sudheer Babu, Krithi Shetty, Mohanakrishna Indraganti, Mythri Movie Makers, Benchmark Studios, Aa Ammayi Gurinchi Meeku Cheppali Teaser Unleashed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ