ఈమధ్యన కొంతమంది హీరోయిన్స్ పెళ్లి చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా తల్లవుతున్నారు. అందులో శ్రీయ శరణ్ ఓ కూతురుకి జన్మనిచ్చాక ఆ విషయాన్ని బయట పెట్టి షాకిచ్చింది. ఇక కాజల్ అగర్వాల్ కూడా ప్రెగ్నెంట్ అన్న విషయం బయట పెట్టకుండా మ్యానెజ్ చేస్తూ పాత ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. రీసెంట్ గా ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది అది వేరే విషయం. తాజాగా బాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా తల్లయ్యింది.
ఈమధ్యన కొంతమంది సినీ సెలబ్రిటీస్ డివోర్స్ నేపథ్యంలో ప్రియాంక చోప్రా - నిక్ జోనస్ లపై కూడా ఈ డివోర్స్ రూమర్స్ బాగా వినిపించాయి. ప్రియాంక చోప్రా - నిక్ జోనస్ విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆ డివోర్స్ రూమర్స్ కి చెక్ చెప్పి వారిద్దరూ పేరెంట్స్ అయిన శుభవార్తని ఫాన్స్ కి అందించారు.
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నాలుగేళ్ళ క్రితం అమెరికన్ సింగర్ కం యాక్టర్ నిక్ జోనస్ ని వివాహమాడింది. తనకన్నా పదేళ్లు చిన్నవాడైన నిక్ జోనస్ తో సంతోషంగా గడుపుతున్న ప్రియాంక చోప్రా తాజాగా తల్లయ్యింది. అది కూడా సరోగసి ద్వారా పండంటి బిడ్డకి జన్మనిచ్చినట్టుగా జోనస్ దంపతులు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు. సరోగసి విధానంలో తాము పండంటి బిడ్డకి జన్మనిచ్చాముఅని, మాకెంతో ఆనందంగా అనిపించిన ఈ విషయాన్నీ మీతో పంచుకుంటున్నామని, ఈ సమయం మాకెంతో విలువైనది, ఆనందాన్నిచ్చేది కాబట్టి మా పర్సనల్ ప్రయివసీకి భంగం కలిగించొద్దు అంటూ జోనస్ దంపతులు సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు.