ఒకప్పుడు జబర్దస్త్ కి కమెడియన్స్ కోకల్లలుగా వచ్చేసారు. కానీ ఇప్పుడు అదే జబర్దస్త్ కి కమెడియన్స్ కరువయ్యారు. కారణం కొంతమంది వెండితెర మీద సినిమాల్లో బిజీ అయ్యి జబర్దస్త్ వదిలేస్తే.. కొంతమంది మాత్రం హీరోలుగా మారిపోయి జబర్దస్ కి బై బై చెప్పేస్తున్నారు. ఇక కొంతమంది కి మల్లెమాల పెట్టే కండిషన్స్ కి భయపడి వెళ్లిపోతున్నారు. మరికొంతమంది జబర్దస్త్ వదిలేసి.. పక్క ఛానల్స్ కామెడీ షోస్ కి తరలిపోతున్నారు. ప్రస్తుతం జబర్దస్ లో ఆది, సుడిగాలి సుధీర్ లు తప్ప పెద్దగా తెలిసిన మొహాలేవీ లేవు. వరసగా సీరియల్ ఆర్టిస్ట్ లు జబర్దస్త్ స్టేజ్ పై దర్శనమిస్తున్నారు.
మరోపక్క ఢీ లో డాన్సర్స్ గాను, డాన్స్ మాస్టర్స్ కూడా ఇప్పుడు జబర్దస్త్ స్టేజ్ పై స్కిట్స్ చేసుకుంటున్నారు. పండు, సుదర్శన్ మాస్టర్ తో పాటుగా ఇంకా కొంతమంది అమ్మాయిలు, డాన్సర్స్ ఇలా జబర్దస్ స్టేజ్ పై కామెడీ చేసేసుకుంటున్నారు. అదిరే అభి కూడా జబర్దస్ వదిలేసాడు. జబర్దస్త్ లో అభి స్కిట్ లో చేసే రాము వాళ్ళు రాఘవ స్కిట్ లోకి వెళ్లారు. ఆది కూడా పుష్ప సినిమాలోని కేరెక్టర్స్ తో స్కిట్ చేసేసాడు. ఇప్పుడు జబర్దస్ స్టేజ్ పై నవ్వించడానికి కొత్త కమెడియన్స్ రాకపోతే.. జబర్దస్త్ షో మూసుకోవాల్సిందే. లేదంటే ఆది, సుధీర్ లాంటి వాళ్లతో కలిసి గురు, శుక్ర కాకుండా ఒక్కరోజే జబర్దస్త్ ప్రసారం చేసినా చెయ్యొచ్చు.