Advertisementt

ఇక్కడ కూడా జంటగానే

Fri 21st Jan 2022 09:53 PM
mahesh babu,nbl,nandamuri balakrishna,vamsi paidipally,unstoppable talk show,aha videos  ఇక్కడ కూడా జంటగానే
Mahesh and Vamsi on Unstoppable ఇక్కడ కూడా జంటగానే
Advertisement
Ads by CJ

మహర్షి సినిమా టైం నుండి మహేష్ బాబు ని వదలకుండా అంటిపెట్టుకునే ఉంటున్నాడు దర్శకుడు వంశి పైడిపల్లి. మహేష్ క్రికెట్ చూడడానికి వెళ్లినా, లేదంటే ఫ్యామిలీ తో కలిసి సింగపూర్ వెళ్లినా, కాదు దుబాయ్ వెకేషన్స్ కి వెళ్లినా..మహేష్ ఎక్కడికి వెళ్లినా.. వంశి పైడిపల్లి తన ఫ్యామిలీ తో అక్కడ వాలిపోతాడు. ఇక మహర్షి తర్వాత మహేష్ తోనే మూవీ అని వంశీ కలలు కన్నాడు. కానీ మహేష్ కి వంశి చెప్పిన కథ నచ్చలేదేమో.. వంశీతో సినిమా చెయ్యలేదు. కానీ ఫ్రెండ్ షిప్ కంటిన్యూ చేస్తున్నాడు. ఈమధ్యన న్యూ ఇయర్ వేడుకల కోసం మహెష్ దుబాయిలో బూర్జ ఖలీఫాకి వెళితే.. అక్కడ కూడా వంశీ పైడిపల్లి ఫ్యామిలీతో ప్రత్యక్షమయ్యాడు.

అప్పుడే అన్నారు మహేష్ ని వదలవా పైడిపల్లి అని. ఇక మహేష్ బాబు టాక్ షోస్ లో పాల్గొనడం చాలా అరుదు. ఈమధ్యన మహేష్ బాబు ఎన్టీఆర్ తో ఎవరు మీలో కోటీశ్వరులు గేమ్ తో పాటుగా, బాలకృష్ణ హోస్ట్ గా వస్తున్న ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో లో పాల్గొన్నాడు. అయితే మహేష్ తో పాటుగా ఆ టాక్ షోకి వంశి పైడిపల్లి కూడా రావడమే అందరికి విచిత్రంగా తోచింది. మహేష్ ఎక్కడ ఉంటే పైడిపల్లి అక్కడ ఉంటాడా అంటున్నారు. మహేష్ బాబు తో పాటుగా వంశీ బాలయ్య తో అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నాడు. అందుకే ఇక్కడ కూడా జంటగానేనా అంటున్నారు నెటిజెన్స్. 

Mahesh and Vamsi on Unstoppable:

Mahesh Babu and Vamsi paidipally on Unstoppable talk show

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ