Advertisementt

బాలయ్య మీదే సెటైర్ వేసిన మహేష్

Fri 21st Jan 2022 08:45 PM
unstoppable,balakrishna,mahesh babu,aha videos,unstoppable entertainment,vamsi paidipally  బాలయ్య మీదే సెటైర్ వేసిన మహేష్
Unstoppable promo : Balakrishna-Mahesh Babu provide unstoppable entertainment బాలయ్య మీదే సెటైర్ వేసిన మహేష్
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్ స్టాప్ బుల్ ఫైనల్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆహా అన్ స్టాపబుల్ ఫైనల్ ఎపిసోడ్ గెస్ట్. దర్శకుడు పైడిపల్లి వంశి కూడా మహేష్ తో వున్నారు ఈ ఎపిసోడ్ లో. బాలకృష్ణ మీ నాన్నగారు కృష్ణగారు.. బాగా సెటైర్స్ వేస్తారు మరి మీరు కూడా బాగా సెటైరికల్ ఉంటారట అని మహేష్ బాబు ని అడిగితే, అవును నా సెటైర్స్ కి టైమింగ్ ఉంటుంది అని సమాధానం ఇచ్చారు మహేష్. అలాగే బాలకృష్ణ తాను కొడుతున్నప్పుడు దేవుడిని చూస్తారు అనగానే, మహేష్ వెంటనే, మీలో ఎవరయినా దేవుడిని చూస్తారా అని అక్కడున్న ప్రేక్షకులని అడగ్గానే, అందరు నవ్వారు. బాలకృష్ణ కూడా, చూసారా, మహేష్ సెటైర్స్ నా మీదే వేసేశాడు, ఇంకా లాగుతా ఇలాంటివి బయటకి, అన్నారు. 

మహేష్ - బాలయ్య ప్రోమో ఎలా ఉంటుందో.. ఎలా ఉంటుందో అని అనుక్షణం ఆత్రంగా ఉన్నారు ప్రేక్షకులు. ఎందుకంటే బాలయ్య ఈమధ్యన చిన్నపిల్లాడిలా అల్లరి చేస్తున్నారు.. మహేష్ కాస్త సీరియస్ గా ఉంటారు. ప్రోమో అయితే అదిరింది. ఫైనల్ ఎపిసోడ్ బాలకృష్ణ మహేష్ బాబు లు ఈ టాక్ షో మొత్తానికి ఒక హైలైట్ లా, అద్భుతంగా తీసుకు వచ్చారు. ఈ టాక్ షో ఇప్పటికే టాప్ లో వుంది. అలాగే మహేష్ షూటింగ్ లో జరిగిన సంఘటన గురించి చెపుతూ, తాను డైలాగ్ చెపుతూ వున్నప్పుడు, ఆ సీన్ లో ఒకామె గేమ్స్ ఆడుకుంటోందని, డైలాగ్ కంటిన్యూ చేస్తూ, ఎమ్మా గేమ్స్ కాదు, సీన్ చూడండి అన్నా అని, అదే మీరు (బాలయ్య) అయితే, మైక్ విసిరేవారని సెటైర్ వేసాడు మహేష్ బాబు. ఇలా సరదాగా సాగే ప్రోమో ను వదిలారు. ఫుల్ ఎపిసోడ్ చూడాలంటే ఫిబ్రవరి 04 వరకు ఆగాల్చిందే మరి.

Unstoppable promo : Balakrishna-Mahesh Babu provide unstoppable entertainment:

Unstoppable promo viral 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ