జనవరి 7 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వాల్సిన రాజమౌళి - రామ రావు - రామ్ చరణ్ ల ఆర్.ఆర్.ఆర్ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. నెల రోజుల ప్రమోషన్స్ శ్రమ వృధా అయ్యింది. కరోనా థర్డ్ వేవ్ కారణంగా వరల్డ్ వైడ్ థియేటర్స్ క్లోజ్ అవడంతో.. ఆర్.ఆర్.ఆర్ వాయిదా అనివార్యమయింది. అయితే ఆ తర్వాత టీం మళ్లీ కొత్త డేట్ ఎప్పుడు ఇస్తుందో అనే ఆశతో ఫాన్స్, ప్రేక్షకులు ఉన్నారు. అందరూ ఏప్రిల్ 29 న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ వేసవి స్పెషల్ గా ఉండబోతుంది అంటున్నారు. అయితే సడన్ గా ఆర్.ఆర్.ఆర్ టీం.. సినిమా రిలీజ్ డేట్స్ ప్రకటించేసింది.
అందులోనూ ఆర్.ఆర్.ఆర్ మూవీ కి మేకర్స్ రెండు ఆప్షన్లు పెట్టుకున్నారు. అన్నీ అనుకూలంగా ఉండి, థియేటర్స్ ఓపెన్ అయితే మార్చి 18 న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ఉంటుంది అని, కాదు.. ఇంకా అక్కడక్కడా కరోనా వలన పరిస్థితిలు అనుకూలించకపోతే ఆర్.ఆర్.ఆర్ ని ఏప్రిల్ 28 న రిలీజ్ చేస్తామంటూ మార్చి 18 లేదంటే ఏప్రిల్ 28 న సినిమా రిలీజ్ అంటూ రెండు డేట్స్ ని ఆర్.ఆర్.ఆర్ టీం ప్రకటించింది. మరి కరోనా శాంతిస్తే.. మార్చి 18 నే సినిమా చూసేయ్యోవచ్చు. లేదంటే మళ్ళీ ఏప్రిల్ 28 వరకు వెయిట్ చెయ్యాల్సిందే.