Advertisementt

ఆరోగ్య శ్రీ ఆ రెండు హాస్పిటల్స్ కే పరిమితమా..?

Fri 21st Jan 2022 01:41 PM
medicover hospital,vijayasai reddy,arogyasree health scheme,poor people  ఆరోగ్య శ్రీ ఆ రెండు హాస్పిటల్స్ కే పరిమితమా..?
Medicover hospital is the son-in-law of Vijayasai Reddy ఆరోగ్య శ్రీ ఆ రెండు హాస్పిటల్స్ కే పరిమితమా..?
Advertisement
Ads by CJ

ఆంధ్ర ముఖ్యమంత్రి మరియు అతని ఆత్మా అయినా విజయసాయి రెడ్డి గారు తమ పరిపాలనలో ఎంత అభివృద్ధి చేసాము అంటూ డంబాలు కొడుతూ వుంటారు. ఎప్పుడూ గత ప్రభుత్వాలని విమర్శిస్తూ.. వాళ్ళు అంతా వాళ్ళ వాళ్ళ కోసం చేసుకున్నారు, మేము ప్రజల కోసం అంటూ ఏవేవో చెపుతూ వుంటారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా వాళ్ళ బంధువులైన వారికి కట్టబెడుతోందో ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు. వైజాగ్ లో ప్రధమ హాస్పిటల్ అని చాలా పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ వెంకోజీ పాలెం దగ్గర ఓపెన్ చేసారు. అయితే ఏమయిందో ఏమో, ఆ హాస్పిటల్ ని ఇప్పుడు మేడి కోవర్ వాళ్ళు టేకోవర్ చేసుకున్నారు. మేడి కోవర్ స్వయానా విజయసాయి రెడ్డి గారి అల్లుడిది. అది ఆలా ఉంచండి. 

ఆంధ్రా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ హెల్త్ పథకం పేదవాళ్ల కోసం పెట్టింది కదా, ఆ పథకం కింద ఆ కార్డు వున్న వ్యక్తి హాస్పిటల్ పాలయితే ఖర్చులు ఎంత అయిందో ప్రభుత్వమే హాస్పిటల్ బిల్ పే చేస్తుంది అన్నమాట. అయితే ఇక్కడో మెలిక వుంది. ఏ హాస్పిటల్ అయినా ఆరోగ్యశ్రీ కార్డు వున్న వ్యక్తి కి వెంటనే చికిత్స చెయ్యాలి. కానీ వైజాగ్ లో ఎవరయినా ఎక్కడ ఏ హాస్పిటల్ కి వెళ్లిన, వాళ్ళు మీరు మేడి కోవర్ లేదా అపోలో హాస్పిటల్ కి వెళ్ళండి అని సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే, ఆ రెండు హాస్పిటల్స్ కి మాత్రం ప్రభుత్వం వెంటనే ఆ కార్డు వున్న వ్యక్తి హాస్పిటల్ బిల్ పే చేసేస్తోంది. మిగతా ఏ హాస్పిటల్ కి వెళ్లిన కూడా, నిధులు లేవు తరువాత ఎప్పుడో పే చేస్తాం అని చెప్తోంది ప్రభుత్వం. సో, దీన్ని బట్టి ఏమి అర్థం అయింది, విజయసాయి రెడ్డి అల్లుడికి అయితే మాత్రం నిధులు వెంటనే విడుదల చేసేస్తారు. మనవాళ్ళు అయితే వెంటనే నిధులు బదిలీ చెయ్యటం, వేరే వాళ్ళు అయితే నిధులు ఉండవా? ఇదెక్కడి న్యాయం రాజా..?

Medicover hospital is the son-in-law of Vijayasai Reddy:

Arogyasree Health Scheme for the poor people

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ