ఆమధ్య నాగ చైతన్య - సమంత విడిపోయారు, మొన్న ధనుష్ - ఐశ్వర్య విడిపోయారు, చిరంజీవి కూతురు శ్రీజ - కళ్యాణ్ కూడా విడిపోవడానికి సిద్ధంగా వున్నారు. వీళ్లందరివి ఒక్కసారి పరిశీలిస్తే, వీళ్ళు లాక్ డౌన్ తరువాత విడిపోతున్న జంటలే. అధికారికంగా ఈమధ్య ప్రకటన చేసి విడిపోయారు అంటే, వీళ్ళ మధ్య గొడవలు మొదలయ్యి ఒకటో రెండో సంవత్సరాలు అయ్యి ఉంటుంది కదా. అంటే లాక్ డౌన్ అయ్యాక వీళ్ళు విడిపోవడానికి కారణాలు వెతుక్కున్నారు. లాక్ డౌన్ కాలంలో ఈ జంటలు ఎక్కువగా ఇళ్లకె పరిమితం అవడం, అప్పుడు ఒకరి గురించి ఇంకొకరికి తెలియటం జరిగి ఉంటుంది.
అంటే ఒకరి గురించి ఒకరికి అంటే, వాళ్ళ వాళ్ళ సీక్రెట్స్ అండీ. ఇండస్ట్రీలో సీనియర్స్ ఏమంటున్నారు అంటే, ఈ భార్య భర్తలు లాక్ డౌన్ లో సరిగ్గా ఒకరికొకరు హ్యాండిల్ చేసుకోకపోవటమే ఈ విడాకులకు ప్రధాన కారణం అంటున్నారు. అదే లాక్ డౌన్ లేకపోతే, ఎవరి పని వాళ్ళు చేసుకొని, రాత్రికి ఇంటికి వచ్చి, మళ్ళీ తెల్లవారేసరికి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ గా ఉండేవారు. కానీ లాక్ డౌన్ వచ్చేసరికి పరిస్థితి తారుమారు అయ్యింది. ఒకరికి ఒకరు అర్థం చేసుకోవడానికి బదులు ఒకరిని ఒకరు బ్లేమ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అంతే పరిస్థితి మామూలు అయ్యేసరికి విడాకులే మంచిది అని నిర్ణయానికి వచ్చారు. వీళ్లేనా, ఇంకా ముందు ముందు మరి కొన్ని ఇలాంటి విడాకుల వార్తలు వినాల్సి వస్తుందా? ఏమో వేచి చూడాల్సిందే!