విజయ్ దేవరకొండ చాలా తక్కువ సమయంలో స్టార్ హీరో రేంజ్ అందుకున్నాడు. అదే లెవెల్ ని కంటిన్యూ చేస్తూ ఆ స్టార్ డం తోనే పాన్ ఇండియా మూవీ మొదలు పెట్టాడు. బాలీవుడ్ లో ఇంకా విజయ్ సినిమాలేవీ రిలీజ్ కాకుండానే.. మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడు. బాలీవుడ్ లో హీరోయిన్స్ నోటి వెంట విజయ్ దేవరకొండ పేరు పలవరిస్తున్నారు. ఆయనతో సినిమాలు చేసునేందుకు రెడీగా ఉన్నారు. ఇక టాలీవుడ్ లో విజయ్ సినిమాలు ప్లాప్ అయినా.. ఆ సినిమాలో బాలీవుడ్ లో సూపర్ హిట్స్ అవుతున్నాయి. అంతలా విజయ్ క్రేజ్ హిందీలో పెరిగిపోయింది.
ఇక పూరి జగన్నాధ్ లైగర్ మూవీ తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. లైగర్ మూవీ ఆగష్టు 25 న రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత విజయ్.. సుకుమార్, శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమాలు చెయ్యాల్సి ఉంది. అయితే లైగర్ మూవీ రిలీజ్ కాకుండానే విజయ్ దేవరకొండ తన పారితోషకాన్ని అమాంతం పెంచేసాడనే టాక్ వినబడుతుంది. లైగర్ మూవీ కి దాదాపుగా 35 కోట్లు విజయ్ అందుకోబోతున్నాడట. ఆ తర్వాత ఆయన చెయ్యబోయే సినిమాలకి ఏకంగా 40 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. మరి విజయ్ క్రేజ్ అలాంటిది అని అందుకే దర్శకనిర్మాతలు కూడా విజయ్ అడిగింది ఇచ్చెయ్యడానికి రెడీ అవుతారో.. లేదంటే లైగర్ రిలీజ్ అయ్యాక చూద్దాం అంటారో చూడాలి.