ఒక పక్క కరోనా, మరో పక్క టికెట్ రేట్స్ తగ్గింపు. ఇటువంటి సమయం లో తెలుగు సినిమా థియేటర్స్ లో విడుదల చెయ్యటమే కాకుండా, ఆ సినిమా ఏభయి రోజులు పూర్తి చేసుకుంది అంటే మాటలా. అది ఒక్క నందమూరి బాలకృష్ణ కె చెల్లింది. సినిమా ఎన్ని వందల కోట్లు కలెక్టు చేసింది, పాన్ ఇండియా సినేమానా కాదా, ఇలాంటివి ఏమి లేకుండా, తన అఖండ సినిమా విదుదల చేసాడు బాలకృష్ణ. సినిమాకి బంపర్ ఓపెనింగ్స్ రావటమే కాకుండా, చాలా పెద్ద సక్సెస్ అయింది. అదొక్కటే కాదు, బాలకృష్ణ మిగతా వాళ్ళకి ఒక తోవ చూపించాడు తన అఖండ సినిమాతో.
ప్రతి వాళ్ళు ఇప్పుడు ఫేక్ కలెక్షన్స్ తో తమ సినిమా ఇంత వసూలు చేసింది, అంత వసూలు చేసింది అని చెప్పుకునే పరిస్థితుల్లో, బాలకృష్ణ సినిమా ఏభయి రోజులు ఆడటం నిజాయితీతో కూడిన విషయం. అందుకే బాలకృష్ణకి బాలకృష్ణ నే పోటీ మరియు సాటి. అతని రూటే వేరు, తన మార్కు చిత్రాలతో తాను దూసుకుపోతూ ఉంటాడు. అదీ బాలకృష్ణ అంటే. ఏ సినిమా కూడా వంద రోజులు, ఏభయి రోజులు పండగ ఈమధ్య కాలంలో చేసుకోవటం అరుదు. అటువంటిది బాలకృష్ణ అఖండ ఏభయి రోజులు పూర్తి చేసుకోవటం ఆనందదాయకమే కాదు, సినిమా పరిశ్రమకి కూడా మంచి శుభ సూచకం.