ఆర్.ఆర్.ఆర్ జనవరి 7 న పాన్ ఇండియా లెవల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అన్నాక రాజమౌళి.. ఆర్.ఆర్.ఆర్ మూవీ ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో మొదలు పెట్టారు. ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ వరకు కామ్ గా చేపట్టిన ప్రమోషన్స్ ట్రైలర్ దగ్గర నుండి హీరోలని, నిర్మాతని వెంటేసుకుని ఇండియా లోని పలు సిటీస్ లో ప్రెస్ మీట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్, అలాగే ఆయా భాషల టాప్ టాక్ షోస్, పలు జాతీయ మీడియా ఇంటర్వూస్.. అబ్బో ఒక నెలరోజుల పాటు రాజమౌళి ప్రతి రోజు ఆర్.ఆర్.ఆర్ మాటలు మట్లాడుకునేలా చేసారు. కానీ కరోనా తో ఆర్.ఆర్.ఆర్ జనవరి 7 నుండి పోస్ట్ పోన్ అయ్యింది.
లాస్ట్ మినిట్ లో సినిమాని పోస్ట్ పోన్ చేసిన రాజమౌళి.. అప్పటినుండి ఇప్పటివరకు ఆర్.ఆర్.ఆర్ ఊసు తియ్యడం లేదు. కరోనా థర్డ్ వేవ్ ఉధృతంగా ఉంది. ఆర్.ఆర్.ఆర్ పోస్ట్ పోన్ అన్నాక రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కామ్ అయ్యారు. ఆర్.ఆర్.ఆర్ ముచ్చట తియ్యడం లేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఆర్.ఆర్.ఆర్ వార్తలు వస్తేనే.. మళ్ళీ సినిమా వచ్చేటప్పటికి.. క్రేజ్ ఉంటుంది. చెయ్యాల్సిన ప్రమోషన్ అంతా చేసేసాం.. ఇంకే చెయ్యాలి అన్నట్టుగా ఉంది రాజమౌళి వ్యవహారం. కానీ మళ్ళీ రిలీజ్ డేట్ ఇచ్చేవరకు అప్పుడప్పుడు సినిమా విషయాలు సోషల్ మీడియాలో ఉంచితే సినిమాపై మరింత క్రేజ్ పెరుగుతుంది.