నాని శ్యామ్ సింగ రాయ్ ఆ మధ్య విడుదల అయినప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్స్ గురించి మాట్లాడాడు. సినిమా హాల్ బిజినెస్ కన్నా కిరానా కొట్టు బిజినెస్ చాలా బాగా సాగుతోంది అని కూడా అన్నాడు. అలా అన్నందుకు నాని సినిమాకి చాలా అడ్డంకులు పెట్టారు, కేవలం ఆంధ్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడు అని. ఒక ఆంధ్ర మంత్రి అయితే యాక్టర్ నాని తెలీదు, మంత్రి నాని తెలుసు అని కూడా అనేశాడు. మరి మొన్నీమధ్య నాగార్జున సినిమా కూడా విడుదల అయ్యింది కదా. మరి నాగార్జున సినిమాకి కూడా అలా ఏమి అడ్డంకులు పెట్టకుండా, ఇంకా సదుపాయాలు బాగా చేశారు.
నాగార్జున ఏమో ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ కి స్నేహితుడు, అందుకని నాగార్జున సినిమా బాగా ఆడాలి, పెట్టిన డబ్బులు వచ్చేయాలి. అదీ కాకుండా పండగ రోజులు అన్నీ మొత్తం ఫ్రీ గా వదిలేసారు. మరి అప్పుడు ఈ కోవిడ్ మాట గుర్తుకు రాలేదు మన ఆంధ్ర ముఖ్యమంత్రి గారికి. అందుకేనేమో అప్పటి నుండి రోజు రోజుకి కేసులు పెరుగుతూ వచ్చాయి. మరి నాని సినిమా విడుదల అప్పుడు ఇన్ని కేసులు కూడా లేవు, కానీ చాలా అడ్డంకులు పెట్టారు. నానికి ఒక రూల్, నాగార్జున కి ఒక రూల్ నా.
ఇదెక్కడి న్యాయం ముఖ్యమంత్రి గారు? మరి ఆంధ్ర మంత్రులు అన్ని మాట్లాడారు మొన్నటి వరకు, ఇప్పుడు నాగార్జున సినిమా విడుదల అప్పుడు ఏమి మాట్లాడలేదు ఎందుకు? నాగార్జున సినిమా దర్శకుడు కళ్యాణ్ ఒక ఆంధ్ర మంత్రి గారికి స్వయానా తమ్ముడు కదా! అంతే అయినవాళ్ళకి ఆకుల్లోను, కానీ వాళ్ళకి కంచాల్లోనూ అంటే ఇదేనేమో.