Advertisementt

అనుపమ కెరీర్ తెలుగులో ముగిసినట్టేనా?

Wed 19th Jan 2022 12:29 PM
anupama parameswaran,rowdy boys,asish,small movies,telugu,anupama  అనుపమ కెరీర్ తెలుగులో ముగిసినట్టేనా?
Did Anupama career end in Telugu? అనుపమ కెరీర్ తెలుగులో ముగిసినట్టేనా?
Advertisement
Ads by CJ

అనుపమ పరమేశ్వరన్ మంచి టాలెంట్ వున్న నటి. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆమె ఈమధ్య చేస్తున్న సినిమాలే ఆమె కెరీర్ కి నష్టం తెచ్చే విధంగా తయారయ్యాయి. మొన్న విడుదల అయిన రౌడీ బాయ్స్ అట్టర్ ప్లాప్ అయింది. అనుపమ అందులో ఎన్నడూ లేని విధంగా కుర్ర హీరో ఆశిష్ కి లిప్ లాక్ లు తెగ పెట్టేసింది. దానికి తోడు పేరు వూరు లేని ఒక కొత్త యాక్టర్ పక్కన నటించింది. ప్యాకేజీ బాగుంది కాబట్టి ఈ సినిమా ఒప్పుకుంది అని ఇండస్ట్రీ లో టాక్ వినపడుతున్నా, అనుపమ ఈ సినిమా చెయ్యకుండా ఉండాల్సింది. 

ఈ సినిమా వల్ల ఆమెకి నష్టమే ఎక్కువ తప్ప, లాభం ఒక్క రెమ్యూనరేషన్ మాత్రమే. దిల్ రాజు మీద నమ్మకం తో ఈ సినిమా ఒప్పుకుంది అని అంటున్నారు. కానీ సినిమా పెద్ద ప్లాప్, ఆమె కాతాలో కూడా పడింది. పోనీ ఆమె సినిమా లైన్ అప్ చూస్తే, పెద్దగా పేరు రావాల్సినవి ఏమి లేవు. నిఖిల్ సిద్ధార్థ్ తో ఒక సినిమా, ఇంకో చిన్న సినిమా అంతే. ఇంత వరకు అనుపమ కెరీర్ చూస్తే కనక, ఆమెకి ఒక్క శతమానం భవతి తప్పితే అంత పెద్ద హిట్ లేదు. ఇప్పుడు ఇంత చిన్న నటుల పక్కన చేసిన తరువాత టాప్ స్టార్స్ తో సినిమా చెయ్యటం కూడా కష్టమే. ఈ విధంగా చూస్తే అనుపమ కెరీర్ అయిపోయినట్టే ఇక్కడ. లేదా చిన్న చిన్న సినిమాలు చేసుకోవాల్సిందే.

Did Anupama career end in Telugu?:

Did Anupama Parameswaran career end in Telugu?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ