బాలకృష్ణ కి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ఎన్టీఆర్ బయోపిక్ దగ్గర నుండి చెడింది. రామ్ గోపాల్ వర్మ కి ఎన్టీఆర్ బయోపిక్ డైరెక్షన్ ఛాన్స్ బాలయ్య ఇస్తాడనుకుంటే.. వర్మకి ఇవ్వకుండా ఆ ఛాన్స్ క్రిష్ కి ఇచ్చారు బాలయ్య. దానితో ఒళ్ళు మండిన వర్మ ఎన్టీఆర్ లక్ష్మి పార్వతి మూవీ చేసి బాలయ్యని భారీ దెబ్బకొట్టాడు. అప్పటినుండి బాలయ్య కి వర్మకి పడదు అనే న్యూస్ సోషల్ మీడియాలో పాకిపోయింది. కాకపోతే వర్మ కెలుక్కుంటాడు కానీ.. బాలకృష్ణ మాత్రం ఆ విషయంలో ఎప్పుడూ స్పందించలేదు. అయితే రామ్ గోపాల్ వర్మ అంటే కాంట్రవర్సీకి నెలవు. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు బాలయ్యని ఓ రిక్వెస్ట్ చేస్తున్నాడు.
అదేమిటంటే.. బాలకృష్ణ హోస్ట్ గా అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా ఆహా ఓటిటి నుండి వస్తున్న అన్ స్టాపబుల్ షో తనకి చాలా బాగా నచ్చింది అంటూ వర్మ ట్వీట్ చేసాడు. బాలయ్య అన్ స్టాపబుల్ షో అంతరిక్షంలోకి వెళ్ళిపోయింది అని, తనకి కూడా ఆ షో లో పాల్గొనాలని ఉంది అంటూ వర్మ తన మనసులోని మాట బయట పెట్టడమే కాదు.. నాకు ఓ అవకాశం ఇస్తారా అంటూ ట్వీట్ చేసాడు. మరి అటు మెగా ఫ్యామిలీకి రామ్ గోపాల్ వర్మ విలన్. ఇటు బాలయ్యకి వర్మ విలన్. అలాంటి వర్మకి బాలయ్య అన్ స్టాపబుల్ షో కి ఆహ్వానిస్తారా.. వర్మ రిక్వెస్ట్ ని ఆహా నిర్వాహకులు స్వాగతిస్తారు.. చూద్దాం.