నాగార్జున తన బంగార్రాజు సినిమా ప్రమోషన్స్ అన్నీ తెలంగాణ లోనే జరిపాడు. ఏపీ సీఎం జగన్ ఒక స్నేహితుడిగా నాగార్జున కి హెల్ప్ చేసినా కూడా, ఆంధ్రలో ఒక్క ఈవెంట్ కూడా పెట్టలేదు. సినీజోష్ అదే విషయాన్నీ, పదే పదే నొక్కి రాసింది. నాగార్జున ఎందుకు ఒక్క ఈవెంట్ కూడా ఆంధ్ర లో పెట్టలేదు అని. అన్నీ తన అన్నపూర్ణ స్టూడియో లోనే చేసేసాడు, లేదా ఏదైనా హైదరాబాద్ హోటల్ లో సింపుల్ గా బంగార్రాజు ఈవెంట్స్ కానిచ్చేశాడు. మరి ఆంధ్ర లో నాగార్జున కి అభిమానులు లేరా, అక్కడ తెలుగు ప్రేక్షకులు వున్నారు కదా అని సినీ జోష్ నాగార్జున మీద ఆర్టికల్ రాయటం తో ఎట్టకేలకు నాగార్జున సక్సెస్ మీట్ రాజమండ్రిలో పెట్టాడు.
ఎప్పుడో పెడదాం అనుకున్నాం అని బంగార్రాజు సక్సెస్ మీటింగ్ లో చెప్తున్నారు. మరి ఎందుకు పెట్టలేదు. నాగార్జున కోసం ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ కర్ఫ్యూ కూడా 18 వరకు పెట్టలేదు. ఎందుకంటే సెకండ్ షో వేసుకునేందుకు వీలుగా. అలాగే సినిమా హాల్స్ ఫుల్ ఆక్యుపెన్సీ కూడా ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినా నాగార్జున ఒక్క ఈవెంట్ కూడా పెట్టలేదు అని సినీ జోష్ ఎత్తి చూపింది. దానికి ఫలితం, ఈరోజు ఆంధ్ర లో బంగార్రాజు సక్సెస్ మీట్. బంగార్రాజు సినిమా అంత లేకపోయినా, పండగ కాబట్టి బంగార్రాజు బతికిపోయాడు. సినిమా సక్సెస్ అయ్యింది. నేటి నుండి ఆంధ్ర లో నైట్ కర్ఫ్యూ. ఒక సినిమా ఆట తగ్గించేశారు, ఆక్యుపెన్సీ కూడా సగం చేసేసారు. ఇంకేమి నాగార్జున గారు, జగన్ మీ ఒక్కరి కోసమే రూల్స్ మార్చేశాడు.