మెగా స్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విడుదల తేదీ ఫిబ్రవరి 4 నుండి ఏప్రిల్ ఒకటిన అంటే ఉగాది తెలుగు పండగ సందర్భంగా అని ప్రకటించారు. ఇందులో చిరంజీవి గారి కుమారుడు చరణ్ కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. కొరటాల శివ దీనికి దర్శకుడు. అయితే ఇప్పుడు ఒక చిన్న సమస్య వుంది. ఆచార్య విడుదల అనేది.. చరణ్ నటించిన RRR తరువాత చేద్దాం అని మొదట నుండి అనుకుంటున్నారు. అందుకే RRR సంక్రాంతి కి అనుకుంటే, ఆచార్య ఫిబ్రవరి లో అనుకున్నారు.
ఎందుకంటే రామ్ చరణ్ లుక్ కోసం అలా డిసైడ్ అయ్యారు. రాజమౌళి దర్శకత్వం లో వస్తున్న RRR లో చరణ్ లుక్ ఇంచుమించు ఆచార్య లో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే RRR షూటింగ్ చేసేటప్పుడే ఆచార్య లో కూడా నటించారు రామ్ చరణ్. అందువల్ల లుక్ లో పెద్దగా తేడా తెలియదు. మరి ఇప్పుడు చిరంజీవి గారు ఆచార్య ఏప్రిల్ ఒకటైన వస్తుంది అన్నారు. మరి ట్రిపిల్ ఆర్ విడుదల ఎప్పుడు అని అందరూ ఎదురు చూస్తున్నారు. మరి RRR ని సమ్మర్ లో విడుదల చేస్తారా లేక ఆచార్య కన్నా ముందే వస్తుందా? రామ్ చరణ్ లుక్ లో పెద్దగా తేడా లేకపోవటం వలన, ఆచార్య ట్రిపిల్ ఆర్ మధ్య చాలా గ్యాప్ ఉండాలి. గ్యాప్ లేకపోతే రెండు లుక్స్ ఒకేలా ఉన్నాయని ప్రేక్షకులు కొంచెం నీరసిస్తారు.
అందుకని RRR జూన్ లేదా జులై లో విడుదల అవ్వొచ్చు, లేకపోతే మార్చ్ లో అవ్వొచ్చు. కానీ మార్చ్ లో కష్టం ఎందుకంటే పరీక్షల కాలం అందరూ ఆ బిజీ లో వుంటారు కదా మరి. దీని బట్టి RRR సమ్మర్ లో రావొచ్చు అని ఇండస్ట్రీ లో టాక్. రామ్ చరణ్ ఈ రెండు సినిమాల్లో ఉండటం వల్ల ఇద్దరు నిర్మాతలకి ఇప్పుడు విడుదల తేదీలు పెద్ద సమస్యే.