నందమూరి బాలకృష్ణ అఖండ తర్వాత తన తదుపరి సినిమా గోపీచంద్ మలినేని దర్సకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో స్టార్ట్ అవబోతోంది. అయితే ఇందులో బాలకృష్ణ రెండు పాత్రలు వేస్తున్నట్టు భోగట్టా. మొన్న రిలీజ్ అయిన అఖండ సినిమాలో కూడా బాలకృష్ణ ద్విపాత్రాభినయానం చేసిన సగంతి తెలిసిందే. ఆ సినిమా కూడా అఖండ విజయం సాధించింది కూడా. ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రాబోతున్న సినిమాలో కూడా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒక పాత్రలో బాలకృష్ణ అరవయ్యేళ్ళ వృద్ధుడుగా కనిపించబోతున్నారని వినికిడి.
రాయలసీమ ఫ్యాక్షన్ నేపధ్యం లో కథ ఉండొచ్చని కూడా అంటున్నారు. ఇంకో పాత్రలో యువకుడుగా బాలకృష్ణ కనిపించ బోతున్నారు. ఈ సినిమా కథ లీక్ అయింది. అదేంటి అంటే, ఇప్పుడున్న ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితులకు అనుగుణంగా కథని కొంచెం అల్లుతున్నారు అని, ప్రస్తుతం ఆంధ్ర నుండి అనేక భారీ పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, అందుకని అలాంటి ఒక పెద్ద పరిశ్రమ అనంతపూర్ లో పెట్టాల్సి వుంది, కానీ అది వేరే స్టేట్ కి వెళ్ళిపోయింది. ఆ నేపధ్యాన్ని, ఫ్యాక్షన్ తో కలిపి, బాలకృష్ణ ద్విపాత్రాభినయం లో చూపించబోతున్నారు. ఇందులో వయసు మీరిన బాలకృష్ణ ని అందరూ పెద్దాయన అని పిలుస్తూ వుంటారు. బహుశా అది కూడా సినిమా టైటిల్ కి ఒక సూచన కూడా కావచ్చు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకి నిర్మాతలు. ఇక ఈ సినిమాలో యంగ్ బాలయ్య కి జోడిగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది.