మెగా ఫ్యామిలీకి పెద్ద దిక్కు మెగాస్టార్ చిరు నే. ఇప్పుడిప్పుడే రామ్ చరణ్, అల్లు అర్జున్ మంచి స్టార్ డం సొంతం చేసుకుని మెగాస్టార్ తర్వాత అంతటి పేరు తెచ్చుకుంటున్నారు. అయితే కొంతకాలంగా మెగా ఫ్యామిలీ లో వేరు కుంపటి అనే టాక్ సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ - చిరంజీవికి మధ్యన పొలిటికల్ గ బేధాభిప్రాయాలున్నా.. ఫ్యామిలీ పరంగా కలిసే ఉన్నారు. మరోవైపు అల్లు ఫ్యామిలీ మెల్లగా మెగా ఫ్యామిలీకి దూరం అవుతున్నది. అల్లు అర్జున్ తనకి సపరేట్ గా ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. మెగా ఫాన్స్ నుండి అల్లు ఫాన్స్ అనే పదం సోషల్ మీడియాలో ఎప్పటి నుండో రేజింగ్ లో ఉంది. తాజాగా కాంట్రవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. మెగా ఫ్యామిలీకి ఇప్పుడు మెగా స్టార్ అల్లు అర్జున్ అంటూ సోషల్ మీడియాలో సంచలన ట్వీట్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. (రెండు గంటల తరువాత వర్మ ఆ ట్వీట్స్ డిలీట్ చేసారు)
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అలా అల్లు అర్జున్ ఇప్పుడు మెగా ఫ్యామిలిలో టాప్ స్టార్, మెగాస్టార్ ఇకపై అల్లు అర్జున్ అంటూ సంచలన ట్వీట్స్ చేసాడు. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి నిజమైన హీరో అని, ఆఖరికి అల్లు అర్జున్ స్టయిల్ కి సూపర్ రజినీకాంత్ కూడా షేక్ అవ్వాల్సిందే అంటూ ట్వీట్స్ చేసాడు.
The hard but indisputable fact is ALLU is the new MEGA అంటూ ట్వీట్స్ చేస్తున్నాడు.
ఇప్పుడు మెగా ఫ్యామిలి పై పని లేని రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్స్ ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో కానీ.. చిరంజీవే మా మెగా స్టార్ అంటూ.. మెగా ఫాన్స్ మాత్రం రామ్ గోపాల్ వర్మపై ఫైర్ అవుతున్నారు.