ఈమధ్యన సెలెబ్రిటీ కపుల్స్ విడాకుల విషయం చాలా రొటీన్ గా మారిపోయింది. చిన్న చిన్న బేధాభిప్రాయాలతోనే పాపులర్ జంటలు విడిపోతున్నాయి. ఎంతో క్యూట్ కపుల్ గా.. అందరికి ఆదర్శంగా నిలుస్తున్న జంటలే విడాకుల విషయంలో తేలిగ్గా నిర్ణయాలు తీసుకుని వేరైపోతున్నారు. గత ఏడాది అక్కినేని నాగ చైతన్యకి టాప్ హీరోయిన్ సమంత కి మధ్యన బేధాభిప్రాయాలు రావడంతో విడాకులు తీసుకుని వెరయ్యి ఫాన్స్ ని బాధపెట్టారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ డాటర్ ఐశ్వర్య - స్టార్ హీరో ధనుష్ లు విడాకులు తీసుకుని సూపర్ స్టార్ ఫాన్స్ కి షాకిచ్చారు. ధనుష్ - ఐశ్వర్య లది ఏ నాలుగేళ్లొ, పదేళ్ల బంధమో కాదు.. 18 ఏళ్ళ వివాహబంధానికి వారు ఇప్పుడు విడాకుల తో స్వస్తి చెప్పడం అనేది ఎవరికీ అర్ధం కావడం లేదు.
18 ఏళ్ళు ఫ్రెండ్స్ గా, భార్య భర్తలుగా, తల్లితండ్రులుగా ఒకే దారిలో ప్రయాణం చేసిన మేము.. ఇకపై వేరు వేరు దారుల్లో నడవాలని అనుకుంటున్నామని, మేము వ్యక్తిగతంగా సమయాన్ని వెచ్చించాలని ఈ నిర్ణయం తీసుకున్నామని, ఐశ్వర్య నేను విడిపోవాలనుకున్నాం.. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి అంటూ అటు ఐశ్వర్య ఇటు ధనుష్ లు వేరు వేరుగా తమ విడాకుల నిర్ణయాన్ని సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు.మరి ఇప్పటివరకు ప్రేమగా, స్నేహం గా కలిసి ఉన్న వీళ్ళు ఎందుకు విడిపోవానుకున్నారో అనేది ఫాన్స్ కి అర్ధం కావడం లేదు. కుటుంబం అన్నాక భేదాభిప్రాయాలు సహజం, గొడవలు సహజం.. కానీ సర్దుకుపోతేనే అది నిజమైన ఫ్యామిలీ అవుతుంది .. కానీ ఇలా విడాకుల తో వేరై బాధపడడం ఎందుకు అంటూ ఫాన్స్ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో ఉంచుతున్నారు.