మహేష్ బాబు - పరశురామ్ కాంబోలో మొదలైన సర్కారు వారి పాట.. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యి ఏడాది కావొస్తుంది. ఈ సంక్రాంతికి రిలీజ్ డేట్ ప్రకటించి.. షూటింగ్ మొదలు పెట్టిన మహేష్, ఆర్.ఆర్.ఆర్ కోసం వెనక్కి తగ్గి ఏప్రిల్ 1 కి సర్కారు వారి పాట ని పోస్ట్ పోన్ చేసారు. ఈమధ్యలో మహేష్ కి మోకాలి ఆపరేషన్, ఆ వెంటనే హైదరాబాద్ లో కరోనా బారిన పడడం, ఆ తర్వాత మహేష్ అన్నగారు రమేష్ బాబు అకాల మరణం ఇవన్నీ జరిగిపోయాయి. సర్కారు వారి పాట షూటింగ్ కూడా 70 శాతం పూర్తయ్యింది. ఇంత షూటింగ్ జరిగినా ఈ సినిమాలో మెయిన్ విలన్ ఎవరన్నిది బయటపెట్టలేదు.
మధ్యలో సముద్ర ఖని సర్కారు వారి పాట షూటింగ్ లో జాయిన్ అవడంతో.. ఆయనే మహేష్ మెయిన్ విలన్ అనుకుంటున్నారు. ఇక సర్కారు వారి పాట మూవీ తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ చెయ్యబోతున్నారు. ఆ సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డే నే హీరోయిన్ గా ఎంపికయ్యింది. థమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్ కూడా మొదలైపోయింది. ఫిబ్రవరిలోనే త్రివిక్రమ్ - మహేష్ బాబు సినిమా SSMB28 షూటింగ్ మొదలు కాబోతుంది. ఆ సినిమాలో కన్నడ స్టార్ రవిచంద్రన్ ను తీసుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ పాత్ర కోసం సునీల్ శెట్టిని ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబందించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేస్తుంది అంటున్నారు.