నాగార్జున ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ కి మంచి మిత్రుడు. తన స్నేహితుడి సినిమా సంక్రాంతి పండగకు విడుదల అవుతున్న సందర్భంగా చాలా వెసులుబాటు కల్పించాడు. సెకండ్ షో కి వీలుగా నైట్ కర్ఫ్యూ రాత్రి పన్నెండు నుండి పెట్టాడు, సినిమా హాల్స్ ఫుల్ ఆక్యుపెన్సీ ఇచ్చాడు, ఇంతకు ముందులా సినిమా హాల్స్ పై స్ట్రిక్ట్ విజిలెన్సు కాకుండా వదిలేసాడు. ఇదిలా ఉంటే, ఈ సినిమా దర్శకుడు కళ్యాణ్ ఒక ఆంధ్రా మంత్రి గారికి స్వయానా తమ్ముడు.
ఈ బంగార్రాజు సినిమా విడుదల విషయంలో ఇంత నేపధ్యం వుంది. ఇన్ని చేసిన కూడా, మరి నాగార్జున ఏమి చేసాడు ఒక పండగ లాంటి సినిమా ఇస్తా అని చెప్పి, అదే పాత చింతకాయ పచ్చడి కొత్త జాడీ లో వేసి ఇచ్చాడు అని ప్రేక్షకులు అందరూ అంటున్నారు. నాగ చైతన్య ని చూసి అందరూ సర్ప్రైజ్ అవుతారు అన్నాడు, నిజంగానే అవాక్కయ్యారు సినిమా చూసిన వారు. ఎందుకంటే అభిమానులు అనుకున్నంత,నాగ్ చెప్పినంత గొప్పగా తన కొడుకుని చూపించ లేనందుకు. నాగార్జున సినిమాకి ఇన్ని విషయాలు కలిసి వచ్చినా సినిమా అనుకున్నంత రేంజ్ లేకపోతే, అందరూ ఇలానే విమర్శిస్తారు మరి. ఏది ఎలా వున్నా నాగార్జునకు పండగ సెంటిమెంట్ తో లాభాల పంట.