మన తెలుగు నిర్మాతలు, దర్శకులు పర భాష నుండి వచ్చిన వాళ్ళు అంటే చాలు నెత్తిన పెట్టుకుంటారు, వాళ్ళు ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తే అంత ఇచ్చేస్తారు. ఇంకా మన తెలుగులో అస్సలు నటులు లేనట్టుగా వేరే బాషా నుండి తెచ్చి వాళ్ళని పెంచి పోషిస్తారు. ఈరోజు మనం చూస్తున్నాం ఎంతోమంది పర బాషా నటుల్ని మన తెలుగు సినిమాల్లో, అయితే అదేమీ తప్పు కాదు, కానీ మనవాళ్ళని విస్మరించి వాళ్ళని ఎందుకు నెత్తికి ఎక్కించుకోవటం. తమిళ్ దర్శకుడు సముద్రఖని నటుడుగా అవతారం ఎత్తాక మన తెలుగు వాళ్ళే మోశారు. అతనికి తమిళ్ లో అంత అవకాశాలు రావు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు, కానీ మనవాళ్ళు మాత్రం అతన్ని ఆకాశానికి ఎత్తుతున్నారు.
సముద్రఖని ఇప్పుడు రోజుకి ఏడు లక్షలు డిమాండ్ చేస్తున్నాడు, మన వాళ్ళు ఇస్తున్నారు. సర్కారు వారి పాట, శంకర్ - రామ్ చరణ్ కాంబినేషన్ సినిమా ఇలా పెద్ద సినిమాలు అన్నిటిలో సముద్రఖని ని విలన్ గా తీసుకుంటున్నారు. అదే మన తెలుగు క్యారెక్టర్ నటుల దగ్గరికి వచ్చేసరికి, మన నిర్మాతలు బేరాలు ఆడతారు. తెలుగు వాళ్ళు అనేసరికి మన తెలుగు నిర్మాతలు దర్శకులకే చిన్న చూపు. ఇది చాల విచారకరమయిన విషయం. ఏమైనా అంటే కొత్తదనం అంటారు. వేరే భాష నుండి వచ్చిన ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఈరోజు టాప్ లో వున్నారంటే, మన తెలుగు వాళ్ళ ఇచ్చిన ప్రోత్సాహమే. అతను మంచి నటుడే, అందులో సందేహం లేదు, కానీ అదే విధంగా మన తెలుగు నటుల్ని కూడా ప్రోత్సహిస్తే బాగుంటుంది అని మన ఇండస్ట్రీ లో అనుకుంటున్నారు. ప్రేక్షకులకు కూడా తెలుగు సినిమా చూస్తున్న భావన కూడా ఉంటుంది. పైగా మన మీడియా వాళ్ళు కూడా పర భాష నటులు ఎంత తీసుకున్న అస్సలు ఏమి రాయరు, కానీ మనవాళ్ళు ఒక రెండు మూడు లక్షలు రోజుకి తీసుకుంటే, వాళ్ళ గురించి నెగటివ్ రాసి పడేస్తారు.