నాగ చైతన్య సమంత విడిపోతున్నారు అన్న విషయం గత సంవత్సరం టాప్ వార్తల్లో వుంది కదా. అప్పుడు నాగ చైతన్య చాలా డిప్రెషన్ లో వున్నాడట. ఏమి చెయ్యాలో తెలియక, నాగార్జున తన కొడుకుని తన దగ్గర ఉంచుకోవాలని అనుకున్నాడట. అందుకనే వెంటనే బంగార్రాజు సినిమా హడావిడిగా మొదలెట్టేశారని ఇండస్ట్రీ లో టాక్. చైతన్య అమీర్ ఖాన్ తో హిందీ సినిమా షూటింగ్ కూడా చేసాడు అప్పుడు.
నాగార్జున రోజూ అమీర్ ఖాన్ కి ఫోన్ చేసి చైతన్య ఎలా వున్నాడు కొంచెం చూసుకో అని చెప్పేవాడట. అది అయ్యాక వెంటనే బంగార్రాజు షూటింగ్ మొదలెట్టేసి చైతన్య ని తనతో పాటు రోజూ షూటింగ్ కి తీసుకెళ్లేవారు. ఇలా చెయ్యడం వల్ల చైతన్య కొంచెం మామూలుగా అవుతాడని నాగార్జున నమ్మకం. తండ్రిగా తాను చెయ్యవలసింది చేసాడు నాగార్జున, ఆ టైం లో చైతన్యకి అండగా నిలిచాడు. బంగార్రాజు సినిమాలో లా చైతన్యకు అన్నీ తానై చూసుకొన్నాడట, కానీ మొత్తం ఫోకస్ చైతన్య మీద పెట్టడంతో, బంగార్రాజు సినిమా మీద సరిగ్గా దృష్టి పెట్టలేకపోవటం వల్లే, ఆ సినిమా సోసో గా చుట్టేశారు.. అని ఇండస్ట్రీ లో టాక్ నడుస్తోంది.