దిల్ రాజు పెద్ద నిర్మాత అందరి పెద్ద స్టార్స్ తో సినిమాలు చేసాడు. అందుకనే తన అన్న కొడుకు ఆశీష్ డెబ్యూ సినిమా కి అందరు స్టార్స్ దిగి వచ్చారు. ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా చాలా మంది ఈ సినిమాని సపోర్ట్ చెయ్యడానికి దిగి వచ్చారు. ఇక్కడ విషయం ఏంటి అంటే, మొత్తం ఇండస్ట్రీ లో స్టార్స్ అందరూ వచ్చిన కూడా సినిమాలో విషయం, దమ్ము లేకపోతే వీళ్ళందరూ ఎంత సపోర్ట్ చేసిన కూడా ఏమి ప్రయోజనం ఉండదు.
సినిమా చూసి ప్రేక్షకులు మెచ్చుకోవాలి, పది మందికి చెప్పాలి, అదే పెద్ద పబ్లిసిటీ. ఎంత పెద్ద స్టార్స్ వచ్చి ఎంత బాగుందని చెప్పినా సదరు ప్రేక్షకుడి చేతిలోనే సినిమా ఫలితం ఉంటుంది. అంతే కానీ ఈ స్టార్స్ వల్ల కాదు. ఇప్పుడు అంత డిజిటల్ ఆన్ లైన్ లో అంత తెలిసిపోతుంది. ఒక్కసారి బుక్ మై షో చూస్తే తెలిసిపోతుంది, ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయి, ఎన్ని సినిమా హాల్స్ ఖాళీ వున్నాయన్న విషయం. ఇన్నేళ్ల ఇంత అనుభవం వున్నా దిల్ రాజు కూడా ఈ విషయాన్నీ గ్రహించే వుంటారు. అయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు సుమీ.!